నారా లోకేష్ ను రామ్ గోపాల్ వర్మ తన సినిమాల ద్వారా ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పాలి. తాజాగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో లోకేష్ ను పప్పుగా చిత్రీకరించిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా చిల్డ్రన్స్ డే రోజు లోకేష్ .. చంద్రబాబు దేవాన్ష్ తో ఆడుకుంటున్నట్టు సినిమాలోని ఒక పోస్టర్ రామ్ గోపాల్ వర్మ వదిలారు. బాబు తనయుడి ప్లేటు లో పప్పు వడ్డించడం దగ్గర నుంచి.. పప్పు స్పీచ్ లు దంచే వరకూ ప్రతి విషయం లో యువ నేత లోకేష్ ని టార్గెట్ చేసాడు. ఇక ఇతర కీలక పాత్రలైన పవన్ కళ్యాణ్.. కే.ఏ పాల్ ను అంతే కామిక్ గా ఎలివేట్ చేస్తున్నాడు. ఈ సినిమా లో ఎమోషన్ ఎంత.. సీరియస్ నెస్ ఎంత అన్నది ఎవరికీ తెలియదు గానీ! వర్మ ప్రచారం లో ఎప్పటి లానే తెలివి తేటలు చూపిస్తున్నాడు.


తన సినిమా ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా సరే పబ్లిసిటీ మాత్రం పీక్ లో ఉంటుందని చెప్పాలి. నాయకుల్ని కమెడియన్ల ను చేయడం ద్వారా.. వారి పై సెటైర్లు పంచ్ లు వేయడం ద్వారా జనాల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా నిన్న  (గురువారం) బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి పప్పు తో ఆడుకున్నాడు. మరోసారి ఎంతో కామిక్ టైమింగ్ ఉన్న ఫోటో ను రిలీజ్ చేసాడు. అందులో లోకేష్ పాత్ర దారి.. తనయుడు దేవాన్ష్ తో సరదాగా ఓ గ్రౌండ్ లో ఆడుకుంటోన్న స్టిల్ ను రిలీజ్ చేసాడు. ఆ పక్కనే చంద్ర బాబు  పాత్రధారి తనయుడి వైపు చూస్తుండటం గమనించవచ్చు. వ్యంగ్యం తో కూడిన సెటైర్ ఇది.


ఇప్పుడు ఈ ఫోటో జనాలను బాగా ఆకర్షిస్తుంది. నిజంగా ఒరిజినల్ లోకేష్ మాదిరిగా పాత్రధారి కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో సునామీ లో దూసుకు పోతుంది. ఈ నేపథ్యం లో వైకాపా నేతలు సూపర్భ్  అంటూ కామెంట్లు పెడుతుండగా.. తేదేపా వర్గాలు వర్మను తమదైన శైలి లో విమర్శించడం మొదలు పెట్టారు. కొందరైతే టీడీపీ పార్టీ కార్యలయం లో తండ్రీ కొడుకులిద్దరూ భలే గా ఆడుకుంటున్నారంటూ  కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని ఆర్జీవీ చిన్న పిల్లాడి గా ఉన్నప్పటి ఫోటోని ట్యాగ్ చేసి మరీ ఈ ట్వీట్ కి రీట్వీట్ చేశాడు. మొత్తానికి వర్మ చిన్న పిల్లల రోజుని కూడా వదిలి పెట్టలేదు సుమీ.

మరింత సమాచారం తెలుసుకోండి: