దాసరినారాయణరావు చనిపోయిన తరువాత ఇండస్ట్రీ పెద్దదిక్కుగా మారిన చిరంజీవి ఇండస్ట్రీలో ఏర్పడే ఏవివాదాన్ని అయినా వారిని తన వద్దకు పిలిపించుకుని చిరంజీవి అందరికీ నచ్చేవిధంగా సద్దుబాటు చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక పెళ్ళి కోసం అమెరికా వెళ్ళిన చిరంజీవి నిన్న ఉదయం అమెరికా నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి ‘మా’ సంస్థలో ఏర్పడిన విభేదాలతో పాటు సంక్రాంతి వార్ ను ఇగో వార్ గా మార్చుకుని సంక్రాంతి రేసుకు పోటీ పడుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురం’ నిర్మాతలతో మాట్లాడి ఈరెండు సినిమాలకు కనీసం మూడు రోజులు గ్యాప్ ఉండేలాగా సెట్ చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అవసరం అనుకుంటే చిరంజీవి స్వయంగా బన్నీ మహేష్ లతో మాట్లాడుతాను అని ఈమూవీలను కొనుక్కున్న కొంతమంది బయ్యర్లకు మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈరెండు వ్యవహారాలూ ఒక కొలుక్కి వచ్చాక ఈనెలాఖరు నుండి కొరటాల శివ మూవీ షూటింగ్ లో బ్రేక్ లేకుండా పాల్గొని ఈ మూవీని వేగంగా ఆరు నెలలలో పూర్తి చేసి సమ్మర్ రేస్ కు రెడీ పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉంటే ‘మా’ సంస్థ విభేదాలను చాల నిశితంగా పరిశీలిస్తున్న చిరంజీవి మా సంస్థ అధ్యక్షుడు నరేశ్ ను ఇప్పటికిప్పుడు మార్చడానికి అంగీకరించే ఉద్దేశ్యంలో లేడు అని టాక్.

ప్రస్తుత కార్యవర్గం గడువు ముగిసే వరకు నరేశ్ ను తొలిగించి పనులకు తన సపోర్ట్ ఉండదని చిరంజీవి స్పష్టం చేయబోతున్నట్లు టాక్. దీనితో మా సంస్థ వివాదాలకు తాత్కాలికంగా తెర పడినట్లే అని అంటున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో బన్నీ మహేష్వార్ పై చిరంజీవి తీర్పు ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: