యువ హీరోల్లో మంచి టాలెంట్ ఉన్నా సరే లక్ కలిసి రాని హీరో ఎవరంటే అది సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. మంచి నటన కనబరుస్తున్నా సరే అతనికి హీరోగా ఓ మంచి ఇమేజ్ రాలేదని చెప్పాలి. కెరియర్ లో చెప్పుకోదగిన ఓ సూపర్ హిట్ లేదని చెప్పొచ్చు. అయితే అడపాదడపా పర్వాలేదనేలా హిట్లు కొడుతున్నా అవి అతని కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు.   


కెరియర్ లో రకరకాల సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ తనకు ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటి తానే నిర్మాతగా మారి హిట్టు కొడతా అంటూ నిను వీడని నీడను నేనే సినిమా చేశాడు. ఆ సినిమా నిర్మాతగా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక లేటెస్ట్ గా సందీప్ కిషన్ కామెడీ సినిమాల డైరక్టర్ జి నాగేశ్వర్ రెడ్దితో చేసిన సినిమా తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్. 


కేసులు లేని ఓ లాయర్ తనకి కేసుకు రావడం కోసం ఎలాంటి పంథా కొనసాగించాడు.. తనకు వచ్చిన ఓ కేసుని ఎలా డీల్ చేశాడు అన్న కథను కామెడీగా తెరకెక్కించారు నాగేశ్వర్ రెడ్డి. కొన్నాళ్లుగా దర్శకుడిగా ఆయన కూడా తన రేంజ్ కు తగిన సినిమాలు ఇవ్వలేదు. అందుకే తెనాలి రామకృష్ణ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెబుతున్నారు.


అయితే ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యిందని అంటున్నారు. కథ అంత గొప్పగా లేకున్నా సినిమా మాత్రం పైసా వసూల్ మూవీగా చెబుతున్నారు. సందీప్ కిషన్ సరసన హాన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతో హాన్సిక కూడా తెలుగులో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: