రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఎట్టి పరిస్థితులలోను వచ్చే ఏడాది జులై 30వ తారీఖున విడుదల చేయడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈనేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి పాటల విషయంలో రాజమౌళికి కొనసాగుతున్న కన్ఫ్యూజన్ పై ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. 

ఇది రెగ్యులర్ సినిమా కాకపోయినప్పటికీ ఇందులో ఐదు పాటలను పెట్టె విధంగా రాజమౌళి ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి మొదట్లో ఏడు పాటలు పెట్టడానికి ఆలోచనలు చేసిన రాజమౌళి సుద్దాల అశోక్ తేజ్ చేత వ్రాయించిన పాటలకు కీరవాణి చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

సినిమా దేశభక్తి కథాంశానికి తగ్గట్టు మంచి  విప్లవాత్మక పదాలతో ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ చాలా ఆలోచించి ఈ పాటలను వ్రాసినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే రికార్డు అయిన 7 పాటలు రాజమౌళికి బాగా నచ్చడంతో వీటిలో ఏ పాటను తొలిగించాలి అన్న విషయం జక్కన్నను కన్ఫ్యూజ్  చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ వారిద్దరూ ఒక పాటలో మాత్రమే కలిసి కనిపిస్తారు అనిఅంటున్నారు.  

ఈ పాట ఒక జానపద పాట రీత లో ఉంటూ ఉత్తరాది ప్రాంతంలో ఈ హీరోలిద్దరూ కలిసిన సమయంలో ఈ పాట వస్తుందట. ఈపాటకు తమదైన శైలి లో జూనియర్ చరణ్ లు డ్యాన్సులు వేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ ఈ మూవీ కథ రీత్యా ఇద్దరు కలిసి కనిపించే సన్నివేశాలు చాల తక్కువే అని అంటున్నారు. దీనితో వీరిద్దరి పై ఎక్కువ పాటలను చిత్రీకరించే అవకాశం లేదని అంటున్నారు.  రాజమౌళి 'బాహుబలి' కి సంగీతం చాలా ప్లస్ అయిన సందర్భంలో అలాంటి మ్యాజిక్ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రిపీట్ చేయాలని రాజమౌళి చాలాగట్టి పట్టుదల పై ఉన్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: