టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇద్ద‌రు హీరోలు జ‌న‌వ‌రి 12నే త‌మ సినిమాలు రిలీజ్ అవుతాయంటూ ప్ర‌క‌టించారు. అయితే స‌రిలేరు నీకెవ్వరు టీం ప్ర‌మోష‌న్ల‌లో ఏ మాత్రం ద‌మ్ము చూప‌లేక‌పోతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు వినూత్నంగా ప్రచారం చేసే ఐడియాలు, కాన్సెప్టులు ఉంటే చెప్పండంటూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు పోటీగా ఉన్న అలై వైకుంఠ‌పురంలో సినిమా నుంచి ఏ చిన్న వీడియో, స్టిల్ వ‌దిలినా దూసుకుపోతోంది. రికార్డుల మీద రికార్డులు తిర‌గ‌రాస్తోంది.


ఇక ఇప్ప‌టికే ఈ రేసులో బాగా వెన‌క‌ప‌డిపోయిన స‌రిలేరు టీం ఇప్పుడు ప్ర‌మోష‌న్ల కోసం క్రియేటివ్ ఐడియాలు ఇవ్వాల‌ని చెప్ప‌డం చూస్తే ఇండ‌స్ట్రీ జ‌నాలే షాక్ అవుతున్నారు. మ‌హేష్ వద్ద చాలా పెద్ద పీఆర్ టీమ్ ఉంది. అటు దర్శకుడు అనీల్ రావిపూడి వద్ద కూడా పీఆర్ టీమ్ ఉంది. పైగా సినిమాకు ప్ర‌చారం చేసుకోవ‌డంలో అనిల్‌కు మించిన తెలివి తేట‌లు ఎవ్వ‌రికి ఉండ‌వు.


అయితే ఇప్పుడు ఈ సినిమా రేసులో వెక‌న‌ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయంటున్నారు. సంక్రాంతికే పోటీగా వ‌స్తోన్న స‌రిలేరు సినిమా కంటెంట్ వాళ్లు అనుకున్న దాంతో పోలిస్తే కాస్త వీక్‌గా వ‌చ్చిందంటున్నారు. ఇక మ‌రోవైపు అల వైకుంఠ‌పురంలో సినిమాకు పోటీగా వెళుతున్నారు. ఆ సినిమా మూడు ప్ర‌మోష‌న్ సాంగ్‌లు దంచేస్తున్నాయి. అటు ప్రి రిలీజ్ బిజినెస్‌లోనూ అల సినిమా స‌రిలేరు కంటే చాలా దూకుడు చూపిస్తోంది.


ఇక ఎలా ప్ర‌మోష‌న్ చేయాలో తెలియ‌క స‌రిలేరు నీకెవ్వ‌రు టీం ముందు నుంచి టెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉంది. ఇప్పుడు అల సినిమాకు వ‌చ్చిన హైప్‌ను మించేలా ప్రేక్షకుల్ని మరింతగా ఎట్రాక్ట్ చేసేందుకు, వినూత్నమైన పోకడలతో రావాలని అనుకుంటోంది యూనిట్. మ‌రి ఈ ప్ర‌య‌త్నాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ర్షిస్తాయో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: