వరుసగా తెలుగు రాజకీయాలకు సంబంధించిన కాంట్రవర్షియల్ సినిమాలను చిత్రీకరిస్తూ రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా చేయకముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా తెరకెక్కించి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో మరియు సినిమారంగంలో రణరంగం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ కి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న నేపథ్యంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల విషయంలో అనేక ఆటంకాలు రావడం జరిగాయి. ముఖ్యంగా ఆ సినిమాలో చంద్రబాబుని ఆయన పాత్రను పూర్తిగా నెగిటివ్ గా చూపించారని...అంతే కాకుండా అదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజలు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉందని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల అవకుండా అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది.


అయితే ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో కొంత సమయానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలయింది. ఇదిలా ఉండగా తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ని మరి నారా లోకేష్ ని గట్టిగా టార్గెట్ ఈ సినిమాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరియు అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా...సినిమాలో చూపించబోతున్నాట్లు వార్తలు వినపడుతున్నాయి.


ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో స్వయంగా రామ్ గోపాల్ వర్మ నటించినట్లు ఆయన కన్ఫామ్ చేశారు. అయితే వర్మ పోషించే పాత్ర ఏమిటన్నది మాత్రం ఎవరికి క్లారటీ రాలేదు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో వర్మ.. ఓ టీవీ డిబేట్ లో కనిపించనున్నారు.తన నిజ జీవిత పాత్రనే పోషించనున్నారు. అంటే వర్మ ..వర్మలాగే కనిపిస్తారన్నమాట. కొద్ది సేపు మాత్రమే ఉండే ఈ పాత్రలో వర్మ చెప్పే కొన్ని డైలాగ్స్ హైలెట్ కానున్నాయని సమాచారం. థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చే ఈ డైలాగులు వివాదాస్పందంగా ఉంటాయని, అందుకే వేరే వారి చేత ఆ పాత్రను వేయించకుండా వర్మ తనే స్వయంగా రంగంలోకి దిగి ఈ క్యారెక్టర్ చేసినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: