బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను అలరించే టాప్ షోస్ ఏవి అంటే.. టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్, పటాస్ షోలు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ షోలు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. ఆ షో లలో చేసిన వారి స్థాయి కూడా ఓ రేంజ్ లో ఉంది. జబర్దస్త్ లో స్కిట్ లు చేసుకునే వారి నుంచి జడ్జిల వరుకు ప్రతిఒక్కరి జీవితాలను ఈ షో ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. 


అయితే ఈ షో లో ప్రత్యేకత ఏంటి అంటే.. జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటికీ అదే యాంకర్లు, అదే జడ్జిలు. అయితే పటాస్ లో కూడా ఫస్ట్ నుండి వల్లే ఉన్నప్పటికీ నాలుగు నెలల క్రితం శ్రీముఖి బిగ్ బాస్ 3 కోసం ఆ షో కి రాజీనామా చేసి వచ్చింది. అయితే అప్పటి నుండి యాంకర్ రవి కొత్త యాంకర్ తో పాటు యాంకరింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. 


అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం యాంకర్ రవి కూడా పటాస్ షో కి రాజీనామా చేశారట. ఇందుకు కారణం అతనికి మరో చోట మంచి ఆఫర్ వచ్చింది అని కొందరు అంటున్నారు.. మరి కొందరు మాత్రం యాంకర్ శ్రీముఖి షో కి రాజీనామా చెయ్యడం వల్ల టీఆర్పీ రేట్లు పడిపోయాయి అని అందుకే రవికి ప్రెజర్ ఎక్కువ అవ్వడంతో రవి కూడా రాజీనామా చేశాడని సమాచారం. 


దీంతో రవి స్థానంలో యాంకర్‌గా నోయల్ లేదా జబర్థస్త్ కమెడియన్ చంటి పేర్లను చూస్తన్నారట. ఏది ఏమైనా యాంకర్ రవి, శ్రీముఖిలు లేనిదే పటాస్ షో లేదు అని నెటిజన్లు కూడా అంటున్నారు. ఆ షో చేసేది ఏ యాంకర్ రవి, శ్రీముఖి కోసం అని మరికొందరు అంటున్నారు. మరి ఈ షో కి నెక్స్ట్ ఏ యాంకర్ వస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: