అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ నవంబర్ 14 అంటే నిన్న బాలీవుడ్ ఫిలిమ్ మేకర్ అయిన కరణ్ జోహార్..ముంబయి లోని అతని ఇంటి దగ్గర నిర్వహించిన పార్టీ లో పాల్గొన్నాడు. ఒక మీడియా ఈవెంట్ సందర్భంగా ముంబైకి వెళ్లిన విజయ్ దేవరకొండ అది పూర్తి చేసిన తర్వాత కరణ్ జోహార్ పార్టీ లో పాల్గొన్నాడు. అయితే ఈ పార్టీలో అతనికి మంచి స్వాగతం ఇచ్చారు బాలీవుడ్ నటులు. ఈ పార్టీ కి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీంట్లో ఆలియాభట్ విజయ్ దేవరకొండని "హలో చెప్పండి" అని అనడం.... విజయ్ దేవరకొండ గ్లాస్ పట్టుకొని ఏదో తాగుతూ వంగి నమస్కారం చేయడం మనం చూడవచ్చు. 


ఈ పార్టీ లో ఆలియా భట్ తో సహా అర్జున్ కపూర్ కైరా అద్వానీ, జాక్వలిన్ ఫెర్నాండెజ్ తదితరులు పాల్గొన్నారు. కైరా అద్వాని, ఆలియా భట్ తో విజయ్ దేవరకొండ ఫుల్ గాఎంజాయ్ చేసాడు. మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ బాబా రణవీర్ సింగ్ కలిసి ఒక సెల్ఫీ దిగారు. ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన దగ్గర నుంచి తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి మన తెలుగు హీరో అయిన విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్స్ కి మంచి స్నేహితుడు అయ్యాడు. 


పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో యూత్ హార్ట్స్ లో ఒక టాప్ ప్లేస్ సంపాదించిన.. అర్జున్ రెడ్డి కి ఇప్పటికే సోషల్ మీడియాలో 10 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వస్తున్న 'ఫైటర్' సినిమా లో... అన్నామలై దర్శకత్వంలో వస్తున్న మరో సినిమాలో బైక్ రేసర్ గా... 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.


మరింత సమాచారం తెలుసుకోండి: