యువ హీరో సందీప్ కిషన్, జి.నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన
సినిమా తెనాలి
రామకృష్ణ బిఏ.బిఎల్. టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి పెంచిన ఈ
సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం జరిగింది. రొటీన్ కామెడీతో నాగేశ్వర్ రెడ్డి
సినిమా నడిపించాడని రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఈ సినిమాలో
సందీప్ కిషన్ లాయర్ గా నటించాడు. సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డా
సినిమా మొత్తం నిరాశ పరచినట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో
హీరోయిన్ గా నటించిన హాన్సిక కూడా ఈ
సినిమా ఎందుకు ఒప్పుకుందో అనే డౌట్ వస్తుంది.
హీరోయిన్ కన్నా సినిమాలో వరలక్ష్మి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఆలోచనలో ఉన్న
సందీప్ కిషన్ కు మళ్లీ బ్యాడ్ లక్ వెంటాడింది. అసలేమాత్రం ఆకట్టుకునే కథ కథనాలు లేకపోవడంతో
సినిమా మొదటి టాకే బాగా లేదన్నట్టుగా వచ్చింది.
సందీప్ కిషన్ కు కొన్నాళ్లుగా బ్యాడ్ లక్ వెంటాడుతుంది. తను నిర్మాతగా మారి చేసిన
నిను వీడని నీడను నేనే సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.
వెంటనే నాగేశ్వర్ రెడ్డి లాంటి
కామెడీ డైరక్టర్ తో హిట్టు కొడతాడని అనుకున్నారు కాని
సందీప్ ఆశలు అడి ఆశలయ్యాయి.
సందీప్ కిషన్ ఫ్లాప్ లిస్ట్ లో తెనాలి
రామకృష్ణ కూడా చేరిందని అంటున్నారు. సినిమాలో తన పాత్ర వరకు బాగానే చేసినా నాగేశ్వర్ రెడ్డి కథ కథనాల్లో ఎలాంటి మ్యాజిక్ చేయలేదని తెలుస్తుంది. అసలే ఇప్పటి ఆడియెన్స్ చాలా స్మార్ట్ గా మారారు. వాళ్లను మెప్పిస్తే సినిమాను అందలం ఎక్కిస్తున్నారు లేదంటే వారే ఫ్రీగా
సినిమా గురించి నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి రిపోర్టులు అయితే తెనాలి రామకృష్ణకు అసలు బాగాలేదు. మరి ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.