కొంతమంది హీరోలు ఒక సినిమా పూర్తికాగానే విశ్రాంతి కోసం ఎంతోకొంత సమయం విరామం తీసుకుంటారు. కానీ మాస్ హీరో విశాల్ మాత్రం త‌ను  నటించిన యాక్షన్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ గా విడుద‌ల‌యింది. సి సుందర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో మిల్కీ బ్యూటీ తమన్నా లేడీ కమాండో ఆఫీస్ గా నటించడం విశేషం. యాక్షన్’ సినిమా తెలుగు వెర్షన్ కోసం విలక్షణ నటుడు రానా గొంతు కలిపిన ర్యాప్ సాంగ్ దుమ్ము రేపుతోంది. యాక్షన్ సినిమా కోసం రానా ఈ పాట పాడినట్టు ఇటీవల విశాల ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. మరో వైపు నేడు హీరో విశాల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు.


ఆయన హీరోగా నటిస్తున్న మరో సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగిపోయింది. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు హీరో విశాల్.  విశాల్ హీరోగా నటిస్తూ, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా ఆయన సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘చక్ర’ గా టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో విశాల్ సరసన రెజీనా కసాండ్రా, శ్రద్ధా శ్రీనాధ్ నటిస్తున్నారు. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.


చక్ర అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఎం ఎస్ ఆనందన్ తెరకెక్కించనున్నాడు. గత ఏడాది సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన స్వయంగా నిర్మిస్తుండగా శ్రద్దా శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా, శ్రుతీ డాంగే హీరోయిన్లుగా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: