విక్టరీ వెంకటేష్ నిర్మాతల వర్గం నుంచి హీరోగా వచ్చారన్న సంగతి తెలిసిందే. ఆయన దగ్గుబాటి రామానాయుడు చిన్న కుమారుడు. ఇక వెంకీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇంటి పేరు విక్టరీగా మార్చుకుని ఎన్నో హిట్లు కొట్టారు. ఇక వెంకీ రీమేక్ మూవీస్ చేశారు కానీ ఏ పెద్ద హీరోనూ అనుకరించలేదు. అనుసరించలేదు. ఎందుకంటే ఆయన వెనక వారసత్వ హీరో లేరు కాబట్టి.


అటువంటి వెంకీ ఇపుడు అడవిరాముడు నాటి రోజులకు వెళ్ళిపోతే, అలనాటి అందాల ఎన్టీ రాముడులా మారి స్టెప్పులు వేస్తే అది భలేగా ఉంటుంది కదా. మరి అలాంటి ఊహనే నిజం చేస్తూ వెంకీ మామలో ఎర్లీ  ఎయిటీస్ నాటి పాటను ఒకటి పెడుతున్నారుట.  ఈ సాంగ్ లో వెంకీ మామకు జతగా పాయల్ రాజ్ పుత్ ని పెట్టారట.


మరి వెంకీ మామ ఎన్టీయార్ అయితే అత్తగా నటించే పాయల్ రాజ్ పుత్ ఏకంగా జయప్రదలా మారిపోవాల్సిందే కదా. ఈ సాంగులో పాయల్ అచ్చం జయప్రదలా తన ఆహర్యాన్ని సైతం మార్చేసుకుని కంప్లీట్ గా అదే  స్టైల్లో అనుకరించేసిందిట. అదే విధంగా డ్రైవర్ రాముడు జయసుధలా, వేటగాడు శ్రీదేవిలా కూడా మారి కేక పుట్టించిందట. ఎన్నాళ్ళకో అంటూ నాటి అడవిరాముడు బాణీలో సాగే ఈ సాంగుని రేపు రిలీజ్ చేస్తున్నారుట.



మూవీ అప్డేట్స్ చూస్తూంటే వెంకీ అభిమానులు తెగ హుషార్ గా ఫీల్ అవుతున్నారట. ఈ మూవీకి బాబీ డైరెక్టర్ అయితే సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్లో రిలీజ్ అవుతున్న వెంకీ మామ పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తోంది. అంటున్నారు. మరి మామకు అల్లుడుగా చైతూ, కూతురుగా రాశీ ఖన్నా కూడా రెచ్చిపోయి నటించారని కూడా చిత్ర యూనిట్ చెబుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: