దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ ఇలియానా.. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్‌గా నిలిచింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోయింది. కానీ, ఆ స్టార్‌డమ్‌ను కాపాడుకోలేకపోయింది. బాయ్‌ఫ్రెండ్‌తో సెటిలైపోదామనుకొని, సినిమా కెరీర్‌పై చిన్నచూపు చూసింది. దాంతో అవకాశాలన్నీ దూరమయ్యాయి. అదే సమయంలోనే బాయ్‌ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. 


టాలీవుడ్ లో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే ఇలియానా బాలీవుడ్ కి చెక్కేసింది. ఇక్కడ‌ స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన ఆమె అక్కడ మాత్రం ఓ మోస్తరు వేషాలు దక్కించుకుంది. ఐతే బాలీవుడ్ లో ఆమె కెరీర్ అంతగా అభివృద్ధి అయితే చెందలేదు. కొన్నేళ్ల క్రితం ఇలియానా ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కొన్నాళ్లు రిలేషన్ షిప్ నడిపింది. వీరిద్దరూ ఓపెన్ గానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇంకేముంది త్వరలో పెళ్లి అనుకున్న తరుణంలో ఇద్దరూ బ్రేక్ అప్ చెప్పి షాక్ ఇచ్చారు.


ఈ ఏడాది ఆగస్టులో ఇలియానా-ఆండ్రూ విడిపోయారు. ఐతే తాజాగా ఇలియానా ఈ విషయం పై స్పందించారు. ఆ విషయాలు నేను ఎప్పుడో మరచిపోయానని, ప్రస్తుతం నా ఫోకస్ అంతా వర్క్ మరియు కెరీర్ పైనే అని చెప్పారు. అలాగే నా ఆహార అలవాట్ల విషయంలో మార్పులు చేశానని, గతంతో పోల్చితే ఇప్పుడు హెల్తీ మరియు ఫిట్ గా ఉన్నాను, అని అన్నారు. ఈ బ్యూటీ.. చిరంజీవి-కొరటాల చేయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. చూడాలి మరి.. అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఇల్లీ బేబీ.. మెగాస్టార్ సరసన నటించే అవకాశం కొట్టేస్తుందో, లేదో.మ‌రి స‌డెన్‌గా విడిపోవ‌డానికి కార‌ణాలు ఏమ‌యి ఉంటాయో మాత్రం ఆమె చెప్ప‌లేదు. ఏది ఏమైన‌ప్ప‌టికీ సెల‌బ్రెటీల ప్రేమ‌లు, పెళ్ళిలు చాలా త్వ‌ర‌గా మొద‌ల‌వుతాయి అంతే త్వ‌ర‌గా ముగుస్తాయి కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: