యంగ్‌హీరో సందీప్ కిష‌న్ వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు నినువీడ‌ని నీడ‌ని నేను సినిమాతో ఓ మోస్త‌రు హిట్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత సందీప్ కిష‌న్ కామెడీ సినిమాల స్పెష‌లిస్ట్ జి. నాగేశ్వ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌బీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చేసింది. సినిమా ఫ‌స్టాఫ్ బాగుంద‌ని చెపుతున్నారే త‌ప్ప హిట్ అని ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. 


సినిమా రిలీజ్‌కు ముందు సినిమా టీం అంతా రెండు గంటలు గ్యారంటీగా నవ్విస్తాం అని చెప్పుకొచ్చారు, కానీ వారు నవ్విస్తాం అని నమ్మిన సీన్స్ ఏవీ పెద్దగా నవ్వించలేకపోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్‌రెడ్డి అవుట్ డేటెడ్ కామెడీ సీన్స్ రాసుకుని.. దానిని తెర‌పై స‌రిగా చూపించ‌లేక‌పోవ‌డంతో సెకండాఫ్ పెద్ద బోరింగ్‌గా మారింది.


ఇక హిట్ సినిమాల్లో సీన్ల‌ను తీసుకుని మ‌ళ్లీ రిపీట్ చేసినా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు. చాలా సీన్స్ మనకు రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలలోని సీన్స్ ని ఎక్కువగా గుర్తుకు తెస్తాయి. కొన్ని సీన్లు అతుకుల బొంత‌లా మారాయి. ఇక చ‌మ్మ‌క్ చంద్ర‌తో చేసిన జ‌బ‌ర్ద‌స్త్ సీన్లు కూడా బోర్ బోర్‌గా ఉన్నాయి. ఇక సినిమాను ఎక్క‌డా సీరియ‌స్ మోడ్లోకి తీసుకెళ్లేందుకు ఎక్క‌డా ట్రై చేయ‌లేదు. ఇక ఇంట‌ర్వెల్ బ్లాక్ కూడా స‌ప్ప‌గా ఉండ‌డంతో మ‌రింత నిరుత్సాహ ప‌రిచింది.


క్లైమాక్స్ నిరుత్సాహ ప‌ర‌చ‌డంతో ఈ క్లైమాక్స్ కోస‌మే ఇప్ప‌టి వ‌ర‌కు లాగ్ చేసింది అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఎపిసోడ్స్ కూడా కామెడీ అనిపించ‌లేదు. ఏదేమైనా ఇప్ప‌టికే వ‌రుస‌గా ప్లాపుల్లో ఉన్న నాగేశ్వ‌ర్‌రెడ్డి ఖాతాలో మ‌రో ప్లాప్ ప‌డింది. అటు ఈ సినిమాతో అయినా క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టాల‌నుకున్న సందీప్‌కు మ‌రో ప్లాప్ ప‌డిన‌ట్ల‌య్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: