మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో పర్వాలేదనించే యావరేజ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక దాని తరువాత అతి త్వరలో నటించబోయే 152వ సినిమా కోసం ఆయన పూర్తిగా సంసిద్ధం అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మించబోయే ఈ సినిమా అఫీషియల్ పూజ కార్యక్రమాలు ఇటీవల వేడుకగా జరిగాయి. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే గోవింద ఆచార్య, గోవిందా హరి గోవిందా అనే టైటిల్స్ లో ఏదో ఒకటి నిర్ణయం కాబోతున్నట్లు రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతుండగా, వీటిలో 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ ని ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. నేడు ఈ టైటిల్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పేరు మీద ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందట. దానితో ఈ సినిమాకు గోవిందా హరి గోవిందా అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతము దేశంలోని ప్రధాన సమస్యల్లో ఒకటైన దేవాలయాల్లోని అవినీతిని ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మంచి మెసేజ్ తో పాటు అన్ని రకాల కమర్షియల్ హంగులు, ముఖ్యంగా మెగాస్టార్ నుండి ఆయన ఫ్యాన్స్ ఆశించే అన్ని మాస్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉండేలా కొరటాల కథను సిద్ధం చేశారట. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రాబోయే వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: