హాలీవుడ్‌లో అయితే కొందరు హీరోయిన్లను కేవలం సెక్స్ సీన్ల కోసమే తీసుకునేవారట... ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ పాత్రల కోసమే పనికొచ్చేవారన్నది వాస్తవం... ఓ పాట కోసమో.. హీరో పక్కన హొయలొలికించడం కోసమో హీరోయిన్‌ను సినిమాలో తీసుకునేవారు. ఈ ట్రెండ్ మన దగ్గరే కాదు హాలీవుడ్‌లో కూడా ఉంది. 


హాలీవుడ్ సినిమాల్లో పాటలు ఉండవు కాబట్టి.. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలను ఎక్కువగా చూపిస్తుంటారు. తన కెరీర్ తొలిదశలో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నానని అంటున్నారు ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జొహాన్సన్. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నా కెరీర్ తొలిదశలో నన్ను కేవలం సెక్స్ పాత్రలకు, సెక్స్ సన్నివేశాలకు మాత్రమే తీసుకునేవారని ఆవేదన వ్యక్తం చేసింది. 


 నా వద్దకు స్క్రిప్ట్ వినిపించడానికి వచ్చేవారంతా సెక్స్ గురించే ఎక్కువగా డిస్కస్ చేసేవారని. అలా ఎందుకు అని అడిగితే.. నా కోసం కొందరు వ్యక్తులు ఇలా స్క్రిప్ట్ రాశారని చెప్పేవారు. సినిమా కథ డిమాండ్ చేస్తోంది కాబట్టి తప్పక చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత అసలు సెక్స్ సీన్లు అవసరం లేని సన్నివేశాలు ఉన్న సినిమాలు వచ్చాయి. అందులో కూడా నా కోసం సెక్స్ సీన్లు పెట్టించేవారు. కానీ అప్పట్లో నేను అలాంటి సీన్లలో నటించడం కలిసొచ్చింది. కానీ నేను వాటి కోసమే ఇండస్ట్రీలోకి రాలేదని నిరూపించుకోవడం కష్టమైపోయిందంటుంది ఈ హాలీవుడ్‌ భామ. 


 2009లో నాకు వచ్చిన ‘ఎ వ్యూ ఫ్రమ్ ది బ్రిడ్జ్’ సినిమాలో నటించడం కలిసొచ్చింది. ఈ సినిమా వల్ల నేను టోనీ అవార్డ్ అందుకున్నాను. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. మంచి సినిమాలు, పెర్ఫర్మ్  చేయడానికి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. ఇప్పుడు చూస్తే ఎంతో మారిపోయింది కదా అనిపిస్తుంది. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉందని స్కార్లెట్ జొహాన్సన్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: