యంగ్ హీరో శ్రీ విష్ణుకు సీన్ రివర్స్ అయింది. ఈ యంగ్ హీరో ప్లాన్స్ కు తిప్పరా మీసం బ్రేక్ వేసినట్టు వినిపిస్తోంది. తర్వాత స్టెప్ వేద్దామనుకునే లోపు ఈ హీరోకు షాక్ తగిలింది. మళ్లీ సక్సెస్ పడితే తప్పా శ్రీవిష్ణు కోరిక నెరవేరదు. 


టాలీవుడ్ లోని ఇతర హీరోలకు భిన్నంగా శ్రీవిష్ణు కెరీర్ సాగిస్తున్నాడు. సినిమా  సినిమాకు వైవిధ్యం ఉన్న కథాంశాలతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు. కమర్షియాలిటీ కంటే రియాలిటీ, నేచురాలిటీ ఉన్న సినిమాలు చేసేందుకు శ్రీ విష్ణు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇదే విషయం హీరోగా శ్రీ విష్ణుకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ ఏడాది బ్రోచేవారెవరురా చిత్రంతో విజయం అందుకున్న శ్రీ విష్ణు ఆలోచనకు తిప్పరా మీసం సినిమా అడ్డుకట్ట వేసినట్టు వినిపిస్తోంది. 


శ్రీవిష్ణు గత కొంతకాలంగా సైలెంట్ గా సక్సెస్ లు పట్టేస్తున్నాడు. బ్రోచేవారెవరురా సినిమా కంటే ముందు ఈ హీరో నటించిన నీది నాది ఒకే కథ మంచి విజయం సాధించింది. అంతకుముందు మెంటల్ మదిలో అప్పట్లో ఒకడుండేవాడు సైతం మంచి సక్సెస్ లుగా నిలిచాయి. దీంతో ఈ హీరో పారితోషికం పెంచాలని డిసైడయ్యాడట. కానీ తీరా చూస్తే ఇప్పుడు తిప్పరా మీసం సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో శ్రీవిష్ణు మళ్లీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. 


రెమ్యునరేషన్ పెంచుతాను అంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్పిన శ్రీవిష్ణుకు తిప్పరా మీసం రూపంలో షాక్ తగిలింది. నిజానికి బ్రోచేవారెవరురా తర్వాతే ఈ హీరో రెమ్యునరేషన్ పెంచాలని డిసైడ్ అయ్యాడు. కానీ అంతకుముందే స్టార్ట్ చేసిన తిప్పరా మీసం ఇప్పుడు సడెన్ గా రిలీజై శ్రీవిష్ణు పారితోషికానికి ఎసరు పెట్టింది. దీంతో శ్రీవిష్ణు ఇప్పట్లో పారితోషికం పెంచే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో బ్యాక్ టూ బ్యాక్ రెండు సక్సెస్ లు కానీ శ్రీవిష్ణు రేట్ పెంచే ఛాన్స్ లు ఉంటాయి. మరి రానున్న సినిమాల్లో ఈ యంగ్ హీరోకు ఏ సినిమా సక్సెస్ ఇచ్చి ఆదుకుంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: