తన సినిమా కెరీర్ ప్రారంభించి కేవలం 4-5 ఏళ్ళలోనే విపరీతమైన స్టార్ డమ్ సంపాదించుకుంది కియరా అద్వానీ. ఈ బ్యూటి నటించింది కేవలం ఆరు సినిమాలే. కానీ క్రేజ్ మాత్రం ఊహించనంతగా వచ్చేసింది. ఆ క్రేజ్ ఎంతగా అంటే స్టార్ డైరెక్టర్స్ .. టాప్ హీరోలు.. స్టార్ ప్రొడ్యూసర్స్.. తనకోసం చాలాకాలంగా వెయిట్ చేసేంతగా. అంతేకాదు కార్పొరెట్ బ్రాండ్స్ కూడా ఈ బ్యూటి వెంట రోజు రోజుకి క్యూ కడుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా ముంబైలో ఏ ఫ్యాషన్ ఈవెంట్ చూసినా కియరా తప్ప ఇంకెవరు కనిపించడం లేదు అంటే ఆశ్చర్యపోక తప్పదు. కిల్లింగ్ అప్పియరెన్స్ తో తన తోటి టాప్ మోడల్స్ కి పిచ్చ ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. 

అందుకు తగ్గట్టే ఈ బ్యూటి ఖాతాలో ఇప్పటికిప్పుడు చూసుకున్నా భారీ సినిమాలే ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీ బెస్ట్ బ్రాండ్స్ కూడా తన ఖాతాలో పడ్డాయి. అటు సినిమాలు, ఇటు యాడ్ ఫిలింస్ తో సంపాదిస్తూ యంగ్ బ్యూటీగా కియరా చాలా పాపులరైంది. ఎం.ఎస్.ధోని -యాన్ అన్ టోల్డ్ స్టోరి- భరత్ అనే నేను సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇక 'లస్ట్ స్టోరీస్' తో  అయితే యూత్ ని చంపేసింది. ఆ తర్వాత తన వెంట పడని దర్శక, నిర్మాతలు లెక్కకు మించి ఉన్నారు. ఒకరకంగా ఇది తనకు టార్చర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పాపులారిటీ రావడంతో పెద్ద దర్శకులు, నిర్మాతలు వరుసగా ఆఫర్స్ ఇస్తామంటుంటే ఎవరికి డేట్స్ ఇవ్వాలో తెలీక సతమమవుతోందట.

ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ సినిమాల్లో నటించడమే గాక...  అక్షయ్ లాంటి స్టార్ సరసన అవకాశం అందుకుంది. లక్ష్మి బాంబ్ (అక్షయ్)- గుడ్ న్యూస్ (అక్షయ్)- ఇందూ కి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 సినిమాలతో కియరా క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. నార్త్ లో మాత్రమే కాదు.. ఇటు సౌత్ లో కూడా కియరాకు డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది. అయితే బాలీవుడ్ లో బిజీ షెడ్యూల్స్ వల్ల ఇక్కడ కాల్షీట్లు సర్దుబాటు చేలేపోతోంది. మన స్టార్ హీరోస్ లో ప్రభాస్- చరణ్- ఎన్టీఆర్- మహేష్- బన్ని కియరా పై ఆసక్తిగా ఉన్నా.. క్షణం తీరిక లేనంతగా హిందీ పరిశ్రమలో లాక్ అవ్వడంతో కాల్షీట్లు ఇవ్వలేకపోతోందట. ఏదేమైనా కియారా గ్రేట్ అని చెప్పాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: