గత ఏడాది నుంచి బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ పై వస్తున్న లైంగిక ఆరోపణలపై స్పందించాడు. ఈ మేరకు ఈ వయసులో తనను అనవసరంగా నిందిస్తున్నారని, టార్గెట్ చేస్తున్నారని,  ఇలాంటి నిందలు భరించలేకపోతున్నానని తెలిపాడు. సోషల్ మీడియాలో తనని తాను సమర్ధించుకుంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్.


ఏ తప్పు నేను చేయలేదని.. నిజం దానంతట అదే బయటకొస్తోందని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానన్నారు. కానీ నా మౌనం చేతకానితనం అనుకుంటున్నారు. అందుకే ఈరోజు అన్నింటికి స్పందించాలనుకున్నానని తెలిపాడు. ఈ లైంగిక ఆరోపణలు నా పేరుని చెడగొట్టడం మాత్రమే కాదని, నా కుటుంబాన్ని కూడా చాలా బాధపెట్టాయి. నాకు ఏం చేయాలో తెలీడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


 ఈ వయసులో ఇలాంటి అసభ్యకరమైన నిందలు పడుతున్నందుకు సిగ్గుగా ఉందన్నారు. ముందే వీటి గురించి ఎందుకు బయటపెట్టలేదు. నేను టీవీ షోలలో కనిపించినప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు..? నాకున్న జీవనోపాధి టీవీ షోలు మాత్రమే... ఇద్దరు ఆడపిల్లలకు తండ్రినైన నేను మరో అమ్మాయితో అసభ్యకరంగా ఎలా ప్రవర్తిస్తాను..? మున్ముందు నాపై నిందలు వేయడం కొనసాగితే నేను కోర్టు గడప తొక్కాల్సి వస్తుందని తెలిపారు. 


మ్యూజిక్ డైరెక్టర్ మాలిక్‌ పోస్ట్ పై లైంగిక ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్ సోనా మొహాపాత్ర స్పందించారు. నీ వల్ల వేధింపులు ఎదుర్కొన్న మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా..? టీవీ షోలలో కనిపించే హక్కు నీకు అస్సలు లేదు. కావాలంటే సెక్స్ రిహాబ్‌కి వెళ్లి నీలో ఉన్న లైంగిక కోరికను తగ్గించుకో. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నీ కూతుర్ని ఉద్యోగం చేయమని చెప్పు. నేను 22 ఏళ్ల వయసులో సంపాదించడం మొలుపెట్టాను. నువ్వు చేసిన తప్పుకు కనీసం సారీ చెప్పి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఇద్దరు కూతుళ్లకు తండ్రివి అయినంత మాత్రాన నువ్వు మంచోడివి అయిపోవు. కూతుళ్లు ఉండి కూడా నీలో లైంగిక వాంఛలు తగ్గలేదు. నువ్వు లేకపోతే టీవీ షోలకు పోయిందేం లేదు. కోర్టుకి వెళ్లి తేల్చుకుందాం. అప్పుడు నాలాంటి మరో పది మంది అమ్మాయిలు వచ్చి న్యాయస్థానంలో నీ బండారం బయటపెడతారని హెచ్చరించారు మొహాపాత్ర.


మరింత సమాచారం తెలుసుకోండి: