టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురములో. ఈ రెండు సినిమాలు 2020 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్నాయి. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా అధికారికంగా ఆ వార్తలను ఎవరూ ధృవీకరించలేదు. అల వైకుంఠపురములో సినిమా నుండి విడుదలైన సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై భారీగా క్రేజ్ పెంచాయి. 
 
అల వైకుంఠపురములో సినిమాపై మొదట్లో ప్రేక్షకులకు భారీ అంచనాలు లేకపోయినా ఎప్పుడైతే సామజవరగమన, రాములో రాములా పాటలు విడుదలయ్యాయో అప్పుడే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరోవైపు మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ విషయంలో బన్నీ సినిమాతో పోలిస్తే వెనుకే ఉంది. 
 
తెలుగు రాష్ట్రాల వరకు అల వైకుంఠపురములో సినిమా కంటే సరిలేరు నీకెవ్వరు సినిమా ఎక్కువ రేట్లకు అమ్ముడవుతూ ఉండగా హిందీ మార్కెట్ లో బన్నీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. కొన్ని నెలల నుండి తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్ డౌన్ అయింది. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే బాలీవుడ్ లో భారీ రేట్లకు అమ్ముడవుతున్నాయి. గతంతో పోలీస్తే స్టార్ హీరోల సినిమాలకు కూడా హిందీ మార్కెట్ కొంత తగ్గిందన్నమాట వాస్తవం. 
 
మహేశ్ బాబు మహర్షి సినిమా బాలీవుడ్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ 20కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కానీ మహేశ్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా బాలీవుడ్ హక్కులు మాత్రం 15.25కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కానీ బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురములో హక్కులు మాత్రం దాదాపు 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో బన్నీపై మహేశ్ పై చేయి సాధించినా బాలీవుడ్ మార్కెట్ లో మాత్రం బన్నీ పై చేయి సాధించడం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: