టాలీవుడ్ సినిమా పరిశ్రమకు జంధ్యాల తెరక్కించిన అహనా పెళ్ళంట సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం, తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే కామెడీ టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి ముద్ర వేశారు. ఇక ఆ తరువాత మెల్లగా తనకు వస్తున్న ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగిన బ్రహ్మానందం,  ఇటీవల అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్ గా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే  కొద్దిరోజుల క్రితం తన అనారోగ్యం కారణంగా గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న బ్రహ్మానందం చాలావరకు సినిమాలు చేయడం తగ్గించారు. 

వాస్తవానికి బ్రహ్మానందం గారి కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిన సినిమా ఏది అని అడిగితే ఒకింత కష్టం అనే అంటారు ప్రేక్షకులు. ఎందుకంటే దాదాపుగా ఆయన చేసిన ప్రతి ఒక్క కామెడీ పాత్రలోనూ ఆయన హాస్యం మనల్ని ఎంతగానో నవ్వించింది అనే చెప్పాలి. ఇకపోతే బ్రహ్మి సినిమాలు తగ్గించడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన స్థానాన్ని భర్తీ చేసే మరొక కమెడియన్ లేరని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఇటీవల కాలంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి కొందరు కొత్త కొత్త కమెడియన్స్ వచ్చినప్పటికీ, వారిని బ్రహ్మానందంతో పోల్చలేమని అంటున్నారు. 

అంటే దాని అర్ధం వారు కామెడీ చేయలేరని కాదు, ఆయనలా పూర్తి స్థాయిలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ కొన్నేళ్ల పాటు సినిమా పరిశ్రమలో వారు నిలవగలరా అనే అనుమానం మాత్రం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొద్దిరోజులుగా కమెడియన్ సునీల్ మళ్ళి కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఉండడం, అలాేనే ఆలీ కూడా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, ఇదివరకటి వలే పూర్తి స్థాయిలో కామెడీ పాత్రలు దక్కించుకోలేకపోతున్నారు. మరి ప్రస్తుతం మంచి పేరు గడిస్తూ ముందుకు సాగుతున్న యువ కమెడియన్స్, ఎంతవరకు బ్రహ్మానందంలా వరుస అవకాశాలతో ముందుకు సాగుతారో చూడాలి..... !!   


మరింత సమాచారం తెలుసుకోండి: