ప్రభాస్ మంచి నటుడు, డార్లింగ్. ఆయన‌తో సినిమా అంటే అందరూ డార్లింగులు అయిపోతారు ఆయన ఉన్న సెట్లో హుషార్ ఉంటుందని కూడా చెబుతారు. ఎక్కడా తాను టెన్షన్ పడకుండా  ఎవరినీ పెట్టకుండా కూల్ గా సినిమా చేసే అతి కొద్ది మంది హీరోల్లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడని కూడా చెబుతారు. ఇక డబ్బుల విషయంలో కూడా ప్రభాస్ ప్రాధాన్యం  ఇవ్వడని, ఫ్రెండ్ షిప్ కే విలువ ఇస్తాడని కూడా అంటారు.


ఇక ప్రభాస్ మూడు వందల కోట్లతో రిచ్ గా తీసినా సాహో మూవీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ వల్ల ప్రభాస్ కి సొంతంగా 50 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందట. దాంతో రాధాక్రిష్ణతో తీస్తున్న తరువాత చిత్రం జాన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోమని పెద‌ నాన్న క్రిష్ణంరాజు కూడా ప్రభాస్ ని హెచ్చరిస్తున్నారుట. తక్కువ ఖర్చుతో సినిమా ముగించమని కూడా సూచించారుట. అయితే ప్రభాస్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదుట. మళ్ళీ లావిష్ గా ఈ మూవీని తీయాలని డిసైడ్ అయ్యాడుట. 180 కోట్లకు పైగా ఖర్చుతో జాన్  మూవీని తీసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారట. ఇందుకోసం సెట్స్ కే అరవై శాతం ఖర్చు పెట్టారని  అంటున్నారు. ఈ మూవీ 1960 బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.  


కధ ప్రకారం యూరప్ లో మూవీ తీయాలి. అయితే అక్కడ తీస్తే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని హైదరబాద్ లో పాతిక వరకూ సెట్స్ వేయించారని అంటున్నారు. ఈ సినిమా అంతా ఎక్కువ భాగం సెట్స్ లోనే సాగుతుందిట. ఇలా ప్రభాస్ డేరింగ్ గా ఖర్చు చేయడం వెనక ఒక రీజన్ ఉందని అంటున్నారు. అదేంటి అంటే సాహో అన్ని భాషల్లో ఫెయిల్ అయినా కూడా హిందీలో 130 కోట్లకు పైగా తెచ్చిపెట్టి సూపర్ హిట్ అయింది. దాంతో ప్రభాస్ హిందీ మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకునే జాన్ లో ఎక్కడా యాక్షన్ సీన్లు తగ్గకుండా మళ్ళీ హాలీవుడ్ రేంజిలో తీసేందుకు రెడీ అవుతున్నారుట. ఈ దెబ్బతో అక్కడ సెట్ అవ్వాలన్నది ప్రభాస్ ఆలోచనగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: