మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంటర్ అయినా వాళ్ళల్లో హీరో కళ్యాణ్ దేవ్ కూడ ఒకరు. ఈయన హీరోగా ఎంట్రీ లేచి చాలా కాలం అయింది. కాగా, విజేత సినిమా ద్వారా హీరో గా ఎంటర్ అయినా కళ్యాణ్ ఆ సినిమా  ఓ మాదిరిగా హిట్  అవ్వడం కూడా జరిగింది. ఆ తరువాత ఓ సినిమాలో నటించాడు. కాగా ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళ్యాణ్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. 


అయితే , సినిమా ఎంపికలో కళ్యాణ్ దేవ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. మంచి కథ కోసం వెయిట్ చేసి మొత్తానికి కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో కొత్త అమ్మాయిని తీసుకొనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. ఈ సినిమా అన్న హిట్ అవుతుందో లేదో చూడాలి.. 


కన్నడలో స్టార్ హీరోలందరితో నటించి ప్రస్తుతం బిజీ ఆర్టిస్టు అయిపోయిన రచితా రామ్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా ద్వారా రచిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్‌లో ఈ రచిత పాల్గొంటుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. మరి సినిమాలో ఈ అమ్మడు వల్ల హిట్ అవుతుందని చిత్రయూనిట్ అంచనా. 
రి

జ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పులివాసు ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో  వీకే నరేష్, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణముర‌ళి, ప్రగ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య మొదలగు వారు నటిస్తున్నారు. ఈ సినిమా అన్న హిట్ అవుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: