యాంగ్రీ యంగ్ మాన్ డా.రాజశేఖర్ పెద్ద ప్రమాదం జరిగినప్పటికి చిన్న గాయం కూడా కాకుండా బయట పడ్డాడు. కారు పరిస్థితి ని చూస్తే అందులో ఉన్న వారికి ఖచ్చితంగా పెద్ద గాయాలు అయ్యి ఉంటాయనిపిస్తుంది. కాని రాజశేఖర్ మాత్రం యాక్సిడెంట్ అయిన కొన్ని గంటల్లోనే మీడియా ముందుకు వచ్చి నేను బావున్నాను.. నా గురించి బాధపడ్డ వారికి భయపడ్డ వారికి కృతజ్ఞతలు అన్నారు. రాజశేఖర్ యాక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే చాలా మంది వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

కొందరు మాత్రం రాజశేఖర్ యాక్సిడెంట్ గురించి అస్సలు స్పందించలేదట. వారి గురించి రాజశేఖర్ స్పందిస్తూ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య టాలీవుడ్ లో దారుణమైన కల్చర్ మొదలైంది. తోటి వారు చచ్చిపోయినా కూడా పట్టించుకోకుండా తమ పనేదో తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తోటి మనుషులను ఏమాత్రం పట్టించుకోకుండా మరీ సంస్కారహీనులుగా తయారవుతున్నారు. ఒక తోటి నటుడు యాక్సిడెంట్ కు గురయ్యాడనే విషయంపై స్పందించని ఇండస్ట్రీ వారి గురించి రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడొదక సంచలనం అవుతోంది. 

మీడియాలో రాజశేఖర్ కు పెద్ద యాక్సిడెంట్ జరిగింది.. ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డాడు.. అంటూ చెప్పడంతో పాటు విషయం గురించి వెంటనే జీవిత స్పందించడంతో పాటు కుటుంబ సభ్యులు స్పందించడం ఆ తర్వాత రాజశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం వంటివి జరిగిన తర్వాత ఆయనని  పరామర్శించాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.

చిన్నపాటి గాయాలన్నా అయితే అప్పుడు ఆయనని పరామర్శించడం, ఆయన గురించి మాట్లాడటం చేస్తారు. అంతా బాగున్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఏంటీ.. ఇంత చిన్న విషయానికే సంస్కారహీనులు అంటూ పెద్ద మాట వాడాలా అంటూ కొందరు తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ వ్యవహారం చూస్తుంటే ఎవరి పాయింటాఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే కదా అనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: