సురేష్,
కార్తీక్, శ్రీబాలా, నాయుడు, నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్.కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం “రాజమౌళి-999” . యాన్ అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్
సినిమా అనేది ట్యాగ్ లైన్. మోదటిసారిగా పూర్తిగా
సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ తో యథార్థ సంఘటన ఆధారం రూపొందిన ఈ
సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది .దర్శకుడు ఆర్.కె
సినిమా ప్రపంచంలో జరిగే మోసాలను చాలా సున్నితమైన అంశాలను ఇందులో సూటిగా సంధించాడు . అందుకే ఇది 1 మిలియన్ వ్యూస్ దాటి నెట్టింట్లో హల్చల్ చేస్తూ టాక్ అఫ్ ది
ఇండస్ట్రీ గా మారింది.
సినిమా అంటేనే ఓ వ్యసనం అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్ వంద సంవత్సరాల
సినిమా చరిత్ర ఎందరో స్టార్స్, హిట్స్, సూపర్ హిట్స్ మీకు తెలియని
సినిమా ఒకటుంది అంటూ... తెలియని వయసులో యువత నటన పై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి మోసపోయేవాళ్ళ గురించి వాళ్ళ కెరియర్ ఎలా మొదలై ఎలా ముగుస్తుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి లాంటి విషయాలను ట్రైలర్లో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. చూసిన ప్రతి ప్రేక్షకుడికి ట్రైలర్ ఎంతో అద్భుతంగా బాగా నచ్చుతుంది. అలా చంపాలనుకుంటే సగం ఇండస్ట్రీ చచ్చిపోతుంది కొత్త రక్తం అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది. ప్రస్తుతం యువతకు ఎంతో అవసరమైన విషయాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు తెలుపుతున్నట్లు ట్రైలర్ ఉంటుంది.
సురేష్ ,కార్తీక్ ,శ్రీబాలా ,నాయుడు , నగేష్ నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : ప్రభంజన్, డి .ఓ పి : ప్రసాద్, చందన్, ఎడిటర్ : ఉదయ్ రమేష్, వాయిస్ ఓవర్ :జై
శ్రీనివాస్,
రచయిత ,దర్శకత్వం : ఆర్ . కె, ప్రొడక్షన్ :
భార్గవి క్రియేషన్స్.