యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో యమా జోరుగా సాగింది. వరస హిట్లతో సెకండ్ లీగ్ హీరోలలో చేరతాడని ఒక సందర్భంలో అనుకున్నారు కూడా. కానీ గత సంవత్సరం వరస ఫ్లాపులతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ డీలా పడ్డాడు. అయితే రాజ్ తరుణ్ ఫ్లాపుల ఎఫెక్ట్ ఇప్పుడు కొత్త సినిమాఅపై పడుతోందనే టాక్ వినిపిస్తోంది. రాజ్ తరుణ్ కొత్త సినిమాకు మహా అయితే రెండు వందల స్క్రీన్లు దొరకడం కూడా చాలా గొప్ప అని అంటున్నారు.  

ఎవరు ఎన్ని చెప్పినా థియేటర్ల సంఖ్య అనేది సినిమాకు ఉండే డిమాండ్ ని బట్టే ఆధారపడి ఉంటుంది. పెద్ద స్టార్ హీరోల సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. మొదటి వీకెండ్ లోనే సగానికి పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తారు. కానీ కొత్త హీరోలు.. మీడియం రేంజ్ హీరోల పరిస్థితి అలా ఉండదు. డిమాండ్ లేకపోయినా ఎక్కువ స్క్రీన్లలో కనుక బలవంతగా రిలీజ్ చేస్తే రివర్స్ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. 'థియేటర్లు ఖాళీగా ఉన్నాయి' అనే మెసేజ్ కనుక బైటకు వస్తే నెగెటివ్ టాక్ జోరుగా స్ప్రెడ్ అవుతుంది. అది కూడా మార్నింగ్ షోకే.  అందుకే  డిమాండ్ లేని సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ లో లో రిలీజ్ చెయ్యడం సేఫ్ కాదు. ఇక మరో రీజన్ ఏంటంటే ఫ్లాపులలో ఉన్న హీరోకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించరు కూడా. ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోందని తాజా సమాచారం.

గతంలో రాజ్ తరుణ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేదని.. పెద్ద సంఖ్యలో స్క్రీన్స్ ఇచ్చేవారని.. వరస ఫ్లాపులతో డిమాండ్ తగ్గిపోవడంతో తక్కువ థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందననే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే రాజ్ తరుణ్ తప్పకుండా ఒక కమర్షియల్ హిట్ కొట్టాల్సిందే. లేకపోతే పరిస్థితి మరింతగా దిగజారే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: