ప్రతి జెనరేషన్ లో స్టార్ హీరోలు ఉంటారు. తరం మారే కొద్దీ కొత్త స్టార్ హీరోల వారసులు, స్టార్ హీరోలు వస్తుంటారు. అయితే ఈ మార్పుకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కానీ హీరోయిన్ల విషయంలో అలా కాదు. ప్రతి నాలుగైదేళ్ళకు ఓ జెనరేషన్ మారిపోతుంటుంది. కొంతకాలం క్రితం స్టార్ హీరోయిన్లు అంటే అనుష్క.. సమంత.. కాజల్.. తమన్నా.. శ్రియ పేర్లు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఈ లిస్టులో ఉండే హీరోయిన్లను అసలు స్టార్ హీరోల సినిమాలకు పరిశీలిస్తున్నారా? అంటే అనుమానమే. 
 
సీనియర్ స్టార్లు..తమకు సరైన జోడీ దొరక్క వీరిలో కొందరిని తీసుకుంటున్నారు. ఇక అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పరిమితం అయిపోయింది. సమంత కూడా పెళ్ళి తర్కాత దాదాపు అదే బాటలో ఉంది. అయితే ఈ స్థాయిలో గ్లామర్ ప్లస్ నటన ఉండే హీరోయిన్లు కొత్తతరంలో ఎంత వెతికినా కనిపించడం లేదు. ఒక్క పూజా హెగ్డేకి మంచి క్రేజ్ ఉంది కానీ.. ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి పడలేదు. రష్మికకు కొంత క్రేజ్ ఉన్నప్పటికి స్టార్ హీరోల సినిమాలలో ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి. మరి స్టార్ డం తెచ్చుకుంటుందా లేదా అన్నది కొంతకాలం ఆగితే తెలుస్తుంది. రాశి ఖన్నా లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ పెద్ద స్టార్ హీరోలు ఆఫర్లు ఇవ్వడం లేదు. ఇక మిగతా హీరోయిన్స్ ఒకటి అరా సినిమాలకే ఇంటికెళ్ళిపోతున్నారు. 

మరి కాజల్.. తమన్నా.. అనుష్క.. సమంత ల మాదిరిగా మాస్ ఆడియన్స్ లో గుర్తింపు సాధించే సత్తా ఉన్న హీరోయిన్స్ న్యూ జెనరేషన్ టాలీవుడ్ బ్యూటీస్ లో ఎవరూ కనిపించకపోవడం ఆశ్చర్యకరమే. ఈ సీనియర్ హీరోయిన్ల స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్స్ ఎవరోస్తారో చూడాలి. అయితే ఇలా స్టార్ హీరోయిన్లకు డిమాండ్ ఉండడం కొత్త హీరోయిన్లకు కూడా మచి ఛాన్సే అనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: