టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. సినిమాలు చాలా తెలివిగా తెరకెక్కించడంలో తన మార్క్ చూపించే సుకుమార్ ...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'రంగస్థలం' అనే సినిమా తీసి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇటువంటి నేపథ్యంలో అంతటి మంచి పేరు క్రేజ్ వున్న డైరెక్టర్ సుకుమార్ దగ్గర పనిచేసిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అనే డెబ్యూ డైరెక్టర్ కి సెన్సేషనల్ కుర్ర హీరో నాని ఛాన్స్ ఇచ్చినట్లు ఫిలింనగర్ లో వినబడుతున్న టాక్. ప్రస్తుతం నాని తనని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'v' అనే సినిమాలో నటిస్తున్నారు.


వరుస ఫ్లాపులతో ఉన్న నాని 'జెర్సీ' సినిమా తో మంచి సూపర్ డూపర్ హిట్టు ఇటీవల అందుకొన్నాడు అయితే ఆ తర్వాత చేసిన 'గ్యాంగ్ లీడర్' సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీలో డెబ్యూ డైరెక్టర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో న్యాచురల్ స్టార్ నాని సుకుమార్ శిష్యుడిగా పేరొందిన శ్రీకాంత్ డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథకు నాని ఫిదా అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. దీంతో స్టోరీ మొత్తం ఇటీవల నాని విని శ్రీకాంత్ కి అవకాశం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


అంతేకాకుండా డైరెక్టర్ సుకుమార్ దగ్గర పనిచేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇటీవల చాలామంది కుర్ర హీరోలు అవకాశాలు ఇస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోయే కొత్త సినిమా విషయంలో...ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో న్యాచురల్ స్టార్ నాని 'V' సినిమాకి సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాని నటించిన చివరి సినిమా 'గ్యాంగ్ లీడర్' సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో 'V' సినిమాతో మరొకసారి హిట్ ట్రాక్ ఎక్కాలని 'V' సినిమా కోసం తీవ్రంగా నాని కష్టపడుతున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.  



మరింత సమాచారం తెలుసుకోండి: