తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపింది. అప్పటి వరకు వస్తున్న అన్ని సినిమాలకి విభిన్నంగా ఈ సినిమా నిలిచింది. మూడు గంటల పాటు ప్రేక్షకుడిని సినిమా హాల్లో కూర్చోబెట్టొచ్చని నిరూపించిన సినిమా అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ వల్లనే చాలా సినిమాలు లెంగ్తీగా వచ్చాయి. ఈ సినిమా విజయం  సాధించడమే కాదు ఎన్నో విమర్శలని కూడా మూటగట్టుకుంది.


అయితే ఎన్ని విమర్శలు వచ్చిన సినిమా విజయాన్ని అవి ఆపలేకపోయాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్ర్ం అర్జున్ రెడ్డి. అయితే ఈ చిత్రం ప్రస్తుతం తమిళంలో ఆదిత్య వర్మ అనే పేరుతో రీమెక్ అయింది. మొన్నటికి మొన్న హిందీలో "కబీర్ సింగ్" పేరుతో రీమేక్ అయిన ఈ సినిమాకి బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. కబీర్ సింగ్ సినిమా మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్లని రాబట్టింది.


అయితే తమిళంళో ఈ సినిమాని స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా నిర్మించారు. మొదట ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ, ఎట్టకేలకు దర్శకుడు మారడంతో సినిమా పూర్తయింది. అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశాయ..ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆదిత్య వర్మ పేరుతో ఈ సినిమా నవంబరు 22 వ తారీఖున తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న ధృవ్ కి సక్సెస్ వస్తుందా లేదా చూడాలి.


ఎన్నీ విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా తమిళంలో ఎలాంటి వివాదాలని ఎదుర్కొంటుందో చూడాలి. టాలీవుడ్ జనాలని, బాలివుడ్ జనాలని ఆకర్షించిన అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మగా మారి తమిళ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: