సినిమా రంగంలో మరియు రాజకీయ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయలలిత బయోపిక్ లో బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘తలైవి’ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. రాజకీయరంగంలో జయలలిత ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు జయలలిత రాజకీయ జీవితంలో వచ్చిన వివాదాలు ఇంకా అనేక విషయాల గురించి ఈ బయోపిక్ సినిమా లో ఏఎల్ విజయ్ చూపించడానికి రెడీ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.


ఇటీవల ఈ సినిమా కార్యక్రమాలు మొదలైన నేపథ్యంలో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్న క్రమంలో సినిమాకి సంబంధించి తమిళ భాష మరియు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాల్సిన క్రమంలో జయలలిత పాత్ర చేస్తున్న కంగనారనౌత్ జయలలిత బయోపిక్ సినిమాకి సంబంధించి షాకింగ్ కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కంగనా తమిళం భాషపై మాట్లాడుతూ.. త‌మిళం నేర్చుకోవ‌డం చాలా కష్టం… క‌ష్ట‌మైన‌ప్ప‌టికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను.


డైలాగులు ఈ చిత్రంలో కీల‌కం కానుండ‌గా, ప‌లు డైలాగుల‌ని కంఠ‌స్తం చేస్తున్నాను. ఎప్ప‌టి నుండో త‌మిళం నేర్చుకోవాల‌ని అనుకున్నాను. ఈ చిత్రం ద్వారా అది నెర‌వేరింది అని కంగ‌నా తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతి బాబు మరియు జయసుధ అదేవిధంగా సత్యరాజ్ వంటి సీనియర్ నటులు కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి భారీ తారాగణం సినిమాల ఉండటంతో ఎవరూ ఎటువంటి క్యారెక్టర్ చేస్తున్నారన్నది ఇప్పుడు దక్షిణాది సినిమా రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాని తెలుగు తమిళం మరియు హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. రాబోయే సమ్మర్ కి విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: