సాధారణంగా ఒక టాప్ సెలెబ్రెటీ స్థాయికి చేరుకున్న వ్యక్తులు వారికి మొట్టమొదటి అవకాశం ఇచ్చిన వారిని జీవితాంతం గుర్తించుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణ తనకు మొదటి సినిమాలో అవకాశాన్ని ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావును జీవితాంతం గుర్తుంచుకోవడమే కాకుండా ఆయన కష్ట సుఖాలలో అనేక సహాయాలు చేసాడు.

అదేవిధంగా ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తనకు మొదటి పాటకు అవకాసం ఇచ్చిన కోదండపాణి పేరుతో రికార్డింగ్ స్టూడియోను అదేవిధంగా తనకు మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతకు రజినీకాంత్ ఈ మధ్యనే ఇల్లు కొని ఇచ్చి తమ రుణాన్ని తీర్చుకుంటూ వచ్చారు. అయితే మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవికి మొట్టమొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ కష్టాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారడంతో తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడుని చిరంజీవి ఎందుకు మర్చిపోయాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

చిరంజీవి మొదటి సినిమా ‘పునాది రాళ్ళు’ మూవీకి దర్శకత్వం వహించిన గూడపాటి రాజ్ కుమార్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. కొడుకు అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరి అయిన గూడ పాటి భార్య కూడా ఈమధ్యనే మృతి చెందడంతో అతడు తోడులేని వ్యక్తిగా మారిపోయాడు. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉంటున్న ఈ దర్శకుడు హాస్పిటల్ లో చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇల్లు అద్దె కట్టలేక నానా అవస్థలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈయన తీసిన ‘పునాదిరాళ్ళు’ సినిమాకు ఎన్నో అవార్దులు వచ్చాయి. అప్పట్లో కొన్ని విజయవంతమైన సినిమాలకు కూడ ఆయన దర్శకత్వం వహించాడు. అయితే తాను సంపాధించిన డబ్బును పెద్దగా దాచుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ దర్శకుడుని మెగా స్టార్ చిరంజీవి ఆదుకుంటే బాగుంటుంది అంటూ కొందరు  కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: