‘గబ్బర్ సింగ్’ ఘన విజయం తరువాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ల టీమ్ మళ్ళీ రిపీట్ కాకపోవడానికి వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్న భేదాభిప్రాయాలే కారణం అన్న వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఆవార్తలు వచ్చినప్పుడల్లా వాటిని ఖండిస్తూ పవన్ తనకు దేవుడుతో సమానం అంటూ క్లారిటీ ఇస్తూ వచ్చాడు. 

ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని హరీష్ శంకర్ తిరస్కరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మాత దిల్ రాజ్ ఏదోవిధంగా పవన్ ను ఒప్పించి రీమేక్ చేద్దాము అని అనుకుంటున్న ‘పింక్’ మూవీ విషయంలో హరీష్ శంకర్ కు దిల్ రాజ్ నుండి ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ కు హరీష్ శంకర్ పెద్దగా ఆసక్తి కనపరచలేదు అన్నవార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 

దీనికి కారణం ‘పింక్’ రీమేక్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి ఏమాత్రం సరిపోడనీ అలాంటి మూవీకి దర్శకత్వం వహించి అనవసరంగా తాను పవన్ అభిమానుల ఆగ్రహానికి లోనవ్వదలుచుకోలేదు అంటూ హరీష్ శంకర్ సున్నితంగా దిల్ రాజ్ కు చెప్పినట్లు టాక్. పవన్ నటిస్తాను అంటే పవన్ కు సరిపడే అనేక పవర్ ఫుల్ కథలు తన వద్ద ఉన్నాయని కూడ హరీష్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

దీనితో హడావిడిగా ‘పింక్’ రీమేక్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్న దిల్ రాజ్ వేణు శ్రీరామ్ ను ఈమూవీ రీమేక్ ఎంపిక చేసాడని అయితే వేణు శ్రీరామ్ కు కలిగిన ఆనందం పవన్ లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ రోజులు నిలబడలేదనీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ మళ్ళీ రాజకీయాలలో బాగా యాక్టీవ్ గా మారిపోయిన పరిస్థితులతో పాటు వచ్చే జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి అని లీకులు వస్తున్న నేపధ్యంలో పవన్ తన సినిమా రీ ఎంట్రీ కార్యక్రమాన్ని మరో ఆరునెలలు వాయిదా వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: