‘సైరా’ మూవీ తరువాత చిరంజీవి మరొక మూవీని అప్పుడే మొదలుపెట్టేస్తున్నాడు. అయితే ఇలాంటి భారీ సినిమాలు తీసి ప్రశంసలు దక్కించుకున్న సురేంద్రరెడ్డి పరిస్థితి మాత్రం అయోమయంగా మారిపోయింది. 

వాస్తవానికి చిన్న హీరోలతో సినిమాలు తీయలేక పెద్ద హీరోల డేట్స్ దొరకక సురేంద్ర రెడ్డి పరిస్థితి పజిల్ గా మారింది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో సురేంద్ర రెడ్డి సహాయం తీసుకుని ప్రభాస్ పవన్ కళ్యాణ్ లతో దిల్ రాజ్ నడిపిన రాయబారానికి సురేంద్ర రెడ్డికి విచిత్రమైన సమాధానాలు వచ్చినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు దిల్ రాజ్ కుదిరితే పవన్ కళ్యాణ్ లేకుంటే ప్రభాస్ ఇలా వీరిద్దరిలో ఎవరో ఒకరితో వచ్చే ఏడాది ఒక భారీ సినిమాను చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తూ వీరిద్దరి డేట్స్ కోసం భారీ పారితోషికాలను కూడ ఆఫర్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో దిల్ రాజ్ సూచన మేరకు సురేంద్ర రెడ్డి రంగంలోకి దిగి ప్రభాస్ కోసం ఒక జేమ్స్ బాండ్ కథను పవన్ కోసం ఒక సామాజిక స్పృహతో కూడిన కథను వేరువేరుగా చెప్పినట్లు టాక్. 

వీరిద్దరూ సురేంద్ర రెడ్డి చెప్పిన కథలను ఒపికగా విన్నారు అని తెలుస్తోంది. అంతేకాదు సురేంద్ర రెడ్డి చెప్పిన కథలు తమకు నచ్చాయి అని వారు చెపుతూ మే నెల తరువాత తన నిర్ణయం చెపుతానని ప్రభాస్ ఫిబ్రవరి తరువాత తన నిర్ణయం చెపుతానని పవన్ ఎవరికీ వారు సమాధానాలు ఇవ్వడంతో వారు తన కథలకు ఒప్పుకున్నట్లా లేదా అన్న కన్ఫ్యూజన్ లో సురేంద్ర రెడ్డి ఉన్నట్లు టాక్. దీనితో తన భారీ వ్యూహాలు రెండు బెడిసి కొట్టడంతో ప్రభాస్ పవన్ లలో ఎవరో ఒకరిని తన ప్రొడక్షన్ హౌస్ లో నటించేలా ఒప్పించడానికి ఇంకేమి మార్గాలు ఉన్నాయి అంటూ దిల్ రాజ్ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: