రాజారెడ్డి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఎఫ్ అండ్ ఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ తిరుమూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం లైఫ్ అనుభ‌వించు రాజా. రాజారెడ్డి కందాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూత‌న న‌టీన‌టులు జూనియ‌ర్ ర‌వితేజ‌, శృతిశెట్టి, శ్రావ‌ణినిక్కి జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని శుక్ర‌వారం ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ముఖ్య అతిధిగా విచ్చేసిన‌ ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులు మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల అయింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో...


రాజ్‌కందుకూరి మాట్లాడుతూ... ప్ర‌తి ఒక‌ళ్ళ  లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఎంజాయ్ చెయ్యాల‌నుకుంటారు. ఎప్పుడూ నిర్మాత అనేవాడు బ్యాక్‌బోన్ ఆఫ్ ద ఫిల్మ్. ముందుగా నేను హోల్ హార్టెడ్ ఐ ఎప్రిషియేట్ ఈ చిత్ర నిర్మాత అయిన రాజారెడ్డిగారు. చిన్న సినిమాలు ఈ టైంలో రిలీజ్ చేసే టైం. ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. ర‌వితేజ చాలా బాగా చేశాడు. నేను త‌ను చేసిన కొన్ని సీన్స్ చూశాను. హీరోయిన్లు కూడా చాలా బాగా న‌టించారు. మ్యూజిక్‌, కెమెరా, లిరిక్స్ ఈ చిత్రానికి బాగా కుదిరాయి. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ద బెస్ట్  నేను కూడా ఈ సంవ‌త్స‌రం ఒక సినిమా తీస్తున్నాను అంద‌రూ గోల్డెన్ హ్యాండ్ అంటారు. మ‌రి నా హ్యాండ్ నాకు ఎలా ఉంట‌దో చూడాలి. నేను ఒక సినిమాని నిర్మిస్తున్నాను. నా కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నాను అన్నారు. అలాగే నా హ్యాండ్ నాకెలా ఉంట‌దో చూడాలి అని కాస్త టెన్ష‌న్‌గా అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ రామ్  మాట్లాడుతూః నాకు ఇంత  మంచి అవ‌కాశం ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ టు ద డైరెక్ట‌ర్ అండ్ ప్రొడ్యూస‌ర్ అని అన్నారు.
హీరోయిన్ శ్రావణి నిక్కి మాట్లాడుతూఃముందుగా నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చాలా బాగా వ‌చ్చింది అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి మమ్మ‌ల్ని ఆద‌రించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: