ప్రముఖ దర్శకుడు ఘంటసాల బలరామయ్య మనవడు ఘంటసాల శ్రీనివాస్ సాయి తమన్ ఆ తరువాత సంగీత దర్శుకుడు తమన్ గా మారాడు అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. తమన్ తండ్రి శివ కుమార్ డ్రమ్స్ వాయించడంలో మంచి నిష్ణాతుడు. తన  కుటుంబ సినిమారంగ వారసత్వాన్ని కొనసాగించడానికి సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్ క్యాపీ క్యాట్ అంటూ ట్యూన్‌ లను కాపీ కొడతాడంటూ తమన్‌ పై అనేక విమర్శలు వచ్చాయి.
 
అయితే తన పై ఎన్ని విమర్శలు వస్తున్నా వాటిని పట్టించుకోకుండా తన ప్రతిభను మెరుగు పరుచుకుంటూ ఒకటి కాదు రెండు కాదు దాపు 60 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన తమన్ ప్రస్తుతం అందరి టాప్ హీరోల సినిమాలకు పనిచేస్తూ లక్షలాది అభిమానులను పొందాడు. నేడు తమన్ పుట్టిరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్లు హోరెత్తిస్తున్నాయి.  అంతేకాదు  ‘HappyBirthdayThaman’ అనే హ్యాష్ ట్యాగ్ జాతీయస్థాయిలో ట్రెండింగ్‌ లోకి వెళ్ళిపోవడం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా అతడి క్రేజ్ ను సూచిస్తోంది. 

సంగీత దర్శకుడిగా తమన్ ‌మొదటి సినిమా ‘కిక్’ రవితేజ ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన ఈమూవీతో ప్రారంభం అయిన ఇతడి కెరియర్ జూనియర్ ‘బ‌‌ృందావనం’ తో తార స్థాయికి చేరుకుంది. ఆ మధ్యలో తమన్ క్రేజ్ తగ్గినా తిరిగి ‘అరవింద సమేత’ తో ఫుల్ ట్రాక్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ మూవీ కోసం ఇతడు ట్యూన్  చేసిన పాటల సంచనాలతో ఈ మూవీ క్రేజ్ తార స్థాయికి చేరిపోయింది. 
 
ప్రస్తుతం తమన్ మ్యూజికల్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ‘అల వైకుంఠపురములో’ ని ‘సామజవరగమన’ కు అత్యధిక లైకులు వ్యూస్‌ తో టాప్‌లో ఉండగా ‘రాములో రాముల’ సాంగ్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా మరో రికార్డులు సృష్టించడంతో ఇప్పడు ఎక్కడ చూసినా తమన్ మ్యానియా కనిపిస్తోంది. దీనితో తమన్‌ కు ఆయన అభిమానులు సెలెబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతు అది ట్రెండింగ్ గా మారడంతో తమన్ ను చూసి చాలా మంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ భయపడి పోతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: