రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బోర్డు షాకిచ్చింది. రాజధాని, శతాబ్ధి, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టీ, , టిఫిన్, భోజనం రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టరు గురువారం సర్క్యూలర్ జారీ చేశారు. కొత్త మెనూ, రేట్లు, టికెటింగ్ విధానం 15 రోజుల తర్వాత అందిస్తామని పెంచిన రేట్లు సర్క్యూలర్ జారీ చేసిన తేదీ నుంచి 120 రోజుల తర్వాత వర్తిస్తాయని తెలిపింది. రేట్ల సవరణ తర్వాత రాజధాని, దురంతో, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ.10 నుంచి రూ.15కి చేరింది


ప్రయాణికులను సుదూర ప్రాంతాలకు చేరవేసే రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఆహార పదార్థాల ధరలను కూడా స్వల్పంగా పెంచేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది. దీంతోపాటు మెనూలో కొత్తగా ఆయా ప్రాంతాల అల్పాహారాలకు చోటు కల్పించనున్నారు. 350 గ్రాముల ఈ ‘స్నాక్‌ మీల్‌’కు రూ.50 చార్జి చేస్తారు.


ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్‌లో కప్పు టీ రూ.35గా, సెకండ్ ఏసీ, థార్డ్ ఏసీలో రూ. 20గా, స్లీపర్ క్లాస్‌లో రూ.15గా ధర నిర్ణయించారు. అదేవిధంగా ఈ రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్‌లో బ్రేక్‌ఫాస్ట్ ధర 140గా, సెకండ్, థార్డ్ ఏసీలో రూ.105గా ఉండనుంది. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో భోజనం రూ.245గా.. సెకండ్, థార్డ్ ఏసీలో రూ. 185గా ధరను నిర్ణయించారు.


పెరిగిన ధరలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. అంతేకాదు ఆయా రైళ్లలో ఇకపై ప్రాంతీయ భోజనాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. రైళ్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లు పెరగడంతో టికెట్ ధరలు పెరగనున్నాయి. టీ, టిఫిన్, స్నాక్స్, భోజనం ధరలను కలుపుకొనే ఈ రైళ్లలో టికెట్ ధర ఉంటుందన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: