ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..వంటి ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. అయితే వీరిలో మెగాస్టార్, కలెక్షన్ కింగ్ సొంతగా ఎవరి అండదండలు లేకుడానే స్టార్స్ గా ఎదిగారు. ఇక వారిలో చాలా మందికి మొదటి అవకాశం అంత సులభంగా రాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత అవకాశాలు వచ్చి ఉంటాయన్న సంగతి తెలిసిందే. మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడిని దేవుడు అంటారు. ఒక దర్శకుడు అవకాశం ఇస్తేనే కదా తమ లోని టాలెంట్ ను నిరూపించుకునేది. ఆ అవకాశం ఎవరైతే ఇస్తారో వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతూ ఇండియాలోనే టాప్ స్టార్ గా నిలిచాడు. చిరంజీవి కూడా కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న విషయం కూడా తెలిసిందే. ఈ రోజు కేవలం ఒక్క మెగా ఫ్యామిలీ నుండే ఇండస్ట్రీలో 11 మంది హీరోలున్నారు అంటే అది మెగాస్టార్ వేసిన పూల దారే అని చెప్పాలి. అలాంటి చిరంజీవికి మొదటి అవకాశంను ఇచ్చింది గూడపాటి రాజ్ కుమార్.

పునాది రాళ్లు సినిమాలో ఒక హీరోగా చిరంజీవికి గూడపాటి రాజ్ కుమార్ అవకాశం ఇచ్చారు. ఇంకా ఎంతో మందికి అప్పట్లో ఆఫర్లు ఇచ్చి లైఫ్ ఇచ్చిన దర్శకులు గూడపాటి. అలాంటి గూడపాటి రాజ్ కుమార్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. కొడుకు అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరి అయిన గూఢపాటి ఇటీవలే భార్య కూడా మృతి చెందడంతో తోడు లేని జీవి అయ్యారు. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉంటున్న ఈ యన హాస్పిటల్ లో చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక.. ఇల్లు అద్దె కట్టలేక నానా అవస్థలు పడుతున్నాడట.

మొదటి సినిమాతోనే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న దర్శకుడు గూడపాటి ఆ తర్వాత కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా దర్శకులకు గతంలో భారీ పారితోషికాలు ఉండేవి కాదన్న సంగతి తెలిసిందే. అందుకే గూడపాటి గారు ఏమీ సంపాదించుకోలేక పోయారు. అందుకే ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఎవరైనా సాయం చేయాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: