పరభాషా సినిమాల మీద మన హీరోలకు మక్కువ ఎక్కువైంది. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా రీమేక్ సినిమాలు తెలుగులో సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి యంగ్ హీరో నితిన్ వరకు వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ భాషలో ఆయా చిత్రాలు హిట్ అయినా.. తెలుగులో ఎంతవరకూ మెప్పిస్తాయో వేచి చూడాలి.  ఇటీవ‌ల విడుద‌లైన రాజుగారిగ‌ది-3, మ‌న్మ‌ధుడు-2 ఇలా కొన్ని చిత్రాలను ప‌రిశీలిస్తే. అవి ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్‌లో వేరు వేరు భాష‌ల్లో అందుబాటులో ఉండ‌డం వ‌ల్ల ఎక్కువ‌మంది ఆల్రెడీ చూసేసిన క‌థ‌లే అవ్వ‌డంతో కొత్త‌గా ఎవ్వ‌రూ చూడ‌టానికి ఆస‌క్తి చూప‌డంలేదు. ఒక‌వేళ ఆ క‌థ‌ని తెలుగులో యధాత‌ధంగా తీస్తే అస‌లు మార్పులు లేవని, మార్పులు చేస్తే సోల్ మిస్స‌యిందని ఇలా ర‌క ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో కంప్లైంట్లు వ‌స్తున్నాయి. దీంతో మ‌న హీరోలు రీమేక్‌లు తియ్యాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఆల్రెడీ క‌మిట్ అయిన కొన్ని చిత్రాలు వాటి రైట్స్‌ను కొన్న హీరోలు అవి తియ్యాలా వ‌ద్దా అన్న విధంగా ఆలోచ‌న‌లో ప‌డ్డారు.  వెంక‌టేష్ కొన్న అసుర‌న్ రైట్స్‌, లూసీఫ‌ర్ చిరంజీవి, పింక్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌డం రామ్ పోతినేని, 96 రీమేక్ శ‌ర్వానంద్‌, అంధాధున్ నితిన్  ఇలా చిన్న హీరోల ద‌గ్గ‌ర నుంచి, పెద్ద హీరోల వ‌ర‌కు రీమేక్ చిత్రాల పై ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. దీంతో హీరోల‌కి కొత్త తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే అనుకుంటున్నారు.


లూసిఫర్: మలయాళ సూపర్‌‌స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లూసిఫర్’. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందించనున్నారు. 
పింక్:బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పింక్’ చిత్రం అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. 
అసురన్:ధనుష్ హీరోగా దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం ‘అసురన్’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
తాదం:అర్జున్ విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘తాదం’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మాగి తిరుమేని దర్శకుడు.
96 రీమేక్: విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ’96’. ఈ సినిమా అద్భుత విజయం సాధించడమే కాకుండా విజయ్ సేతుపతి కెరీర్‌లోనే స్పెషల్ మూవీగా నిలిచింది.
అంధాదున్:ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధాదున్’. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుత విజయం అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: