టాలీవుడ్ మన్మధుడు నాగార్జున... ఆయనకు వయస్సు పెరుగుతున్నా అందం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఇప్పటికే ఇద్దరు కొడుకులు సినిమాల్లోకి వచ్చి  రాణిస్తున్న కూడా ఆయన మాత్రం యువ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నారు. ఇక ఫిట్నెస్ విషయంలో అయితే యువ హీరోలు కూడా నాగార్జున కీ సాటి రారు అని చెప్పాలి . ఇప్పటికీ సరికొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారూ నాగార్జున . కేవలం సినిమాలనే కాదు బుల్లితెరపై  కూడా తనదైన స్టైల్ లో  దూసుకుపోతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు... బిగ్ బాస్ లాంటి  షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అయితే నాగార్జున ఎప్పుడు కూల్ గా  ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటారు . నాగార్జున సీరియస్ అవ్వడం మొన్నటి  బిగ్ బాస్ లో తప్ప అంతకు మునుపెన్నడూ తెలుగు ప్రేక్షకుడు చూసి ఎరుగడు. 

 

 

 

 ఇక మొన్నటి  బిగ్ బాస్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన  చిరంజీవి కూడా నాగార్జునకి కోపం ఎంత దూరం ఉంటుందో కూడా తెలిపాడు. ఇక మీడియా సమావేశాల్లో కూడా ఎలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టిన కూడా...  ఎంతో ఓపిగ్గా సమాధానం చెబుతూ ఉంటారు నాగార్జున . ఇలాంటి ట్రాక్ రికార్డ్   ఉన్న నాగార్జున తాజాగా ఓ యాంకర్ పై  సీరియస్ అవ్వటం  ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. నాగార్జున తాజాగా తన తండ్రి  అక్కినేని నాగేశ్వరావు జ్ఞాపకార్థం ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ను  సినీ రంగంలో తమదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న వారికి ఇస్తూ ఉంటాడు. ఈనెల 17 ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. 

 

 

 

 ఈ సందర్భంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నాగార్జున ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా న్యూస్ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున యాంకర్ పై సీరియస్ అయ్యాడట. ఒకవేళ మీ నాన్నగారు అయిన అక్కినేని నాగేశ్వరావు గారు బిగ్ బాస్ హౌస్ లో ఉండి మీరు బిగ్ బాస్ హోస్ట్ గా ఉంటే...మీ  రియాక్షన్ ఏంటి  అని యాంకర్ ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు నాగార్జున కోపంతో ఊగిపోయారు. దీంతో నాగార్జున యాంకర్ పై  అసహనం వ్యక్తం చేస్తు... లోకంలో లేని  మా నాన్నగారిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు లాగుతున్నారు.  ముందు కెమెరా అఫ్  చేయండి అంటూ కాస్త సీరియస్ అయ్యాడట. నాగార్జున ఇచ్చిన సమాధానానికి సదరు యాంకర్ ముఖం  చిన్న పోయిందట. ఆ తర్వాత కాసేపటికి యాంకర్  నాగార్జునకు సారీ కూడా చెప్పిందట. ఏదేమైనా ఎప్పుడు కూల్ గా నవ్వుతూ ఉండే నాగార్జున యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: