నవ్వేవాళ్లు నవ్వుకున్నా, తిట్టేవాళ్లు తిట్టుకున్నా నా రూటు సపరేటు అంటూ కాంట్రివర్శికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివాదస్పద నటి శ్రీరెడ్డి ఈసారి బిగ్ బాస్ హోస్ట్, సీనియర్ నటుడు అయిన  నాగార్జున పై పర్శనల్ ఎటాక్‌ చేసింది. ప్రస్తుతం తమిళ పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ కోసం తహతహలాడుతున్న శ్రీరెడ్డి, మళ్లీ వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీ అయ్యింది. ఈమధ్యనే చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చిన శ్రీరెడ్డియూట్యూబ్ ఛానల్‌ కి బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తనదైన శైలిలో బూతుల పంచాంగంతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌ లో బాగా వైరల్ అవుతోంది.


మొత్తం ఐదు నిమిషాల నడివితో ఉన్న ఈ ప్రోమో‌లో శ్రీరెడ్డి తన విశ్వరూపాన్ని చూపించింది. ఎప్పటిలాగే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, హీరో నానిని తాట తీసింది. నానితో ఉన్న తనకు ఉన్న రిలేషన్‌ ను పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్‌ - 3 లో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతూ హోస్ట్ నాగార్జున పై సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ‘నా వాల్యూ అర్ధమవ్వాలంటే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి నేను విప్పేసిన ప్యాంటీని పంపిద్దాం’ అనుకుంటున్నా అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. వీటితో పాటు బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి‌ పై తనకు ఉన్న అభిప్రాయాన్ని కుండబద్దలు చేసింది. ఇక శ్రీరెడ్డి ఎవరెవరితో ఎఫైర్ పెట్టుకుంది, ఈ ఏడాదిలో ఎన్నిసార్లు సెక్స్‌ లో పాల్గొన్న విషయాన్ని కూడా సిగ్గులేకుండా చెప్పుకొచ్చింది ఈవిడ.


కాగా బిగ్ బాస్ షో పై శ్రీరెడ్డి గతంలోనూ సంచలన కామెంట్స్ చేసింది ఈవిడ. బిగ్ బాస్ సీజన్ 3లో ఆఫర్ ఇస్తానని నన్ను సంప్రదించి హైదరాబాద్‌ లోని మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న గోల్గొండ హోటల్‌కి పిలుపించుకున్నారని చెప్పింది శ్రీరెడ్డి. తీరా ఆమె హోటల్‌కి వెళ్లాక అక్కడ బిగ్ బాస్ షోకి సంబంధించి అభిషేక్ అనేవాడు ఆమెను కలిశాడని, అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి అన్న విషయాలను తెలియజేస్తూ, నువ్వు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత అక్కడ ఎవడొకడితో కనెక్షన్ పెట్టుకోవాలి, అది నీకు ఇష్టమేనా అని ఆమెను అడిగారంటూ బాంబ్ వేసింది.


వాళ్లు అలా అడిగేసరికి షాక్ అయ్యానని నాకు నచ్చితే దానంటత అది జరిగితే అలాంటి కనెక్షన్స్ పెట్టుకోవచ్చుకాని, ఇలా ఎవరొకరితో కనెక్షన్ పెట్టుకోవడం ఎలా అని అడిగానని వాళ్ల ఆఫర్‌కి నో అని చెప్పలేదంది శ్రీరెడ్డి. ఇక తాను హౌస్‌ లోపలికి వెళ్లిన తరువాత నాకు ఎవడైనా అందగాడు, వాడితో కనెక్షన్ పెట్టుకోవాలి అనిపిస్తే ట్రై చేస్తా అని, ముందు లోపలికి పంపండి తరువాత చూద్దాం అని అతనితో చెప్పిందట శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి మాటలు విన్న బిగ్ బాస్ డైరెక్టర్ అభిషేక్, అది సరే మీకు దుప్పటి లోపల సెక్స్ చేయడం ఇష్టమేనా, కెమెరాలు ఉన్నా ఆ పని చేస్తారా? అని అడిగాడని ఇదేంట్రా బాబూ అంత మంది ముందు దుప్పట్లో సెక్స్ అంటే ఇబ్బంది, సిగ్గు కదా అని అడిగా. అతని మాటలకు నాకు నవ్వు వచ్చింది కూడా. వాడు సరదాగా అంటున్నాడేమో అని నవ్వి, చూద్దాంలే అన్నాదట. నేను అంత సిగ్గులేకుండా సెక్స్ చేసే టైప్ కాదని నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చానని చెప్పుకొచ్చింది ఈ భామ.


ఆ తరువాత మీకు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఇష్టమేనా అని వాళ్లు అడిగారని, దానికి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. వేసుకుంటా అని చెప్పిందట శ్రీరెడ్డి. ఇలా డిస్కషన్ అవుతున్న సందర్భంలో అభిషేక్ కమిట్మెంట్ ఇస్తావా? అని డైరెక్ట్‌ గా అడిగేశాడని, దానికి ఎక్స్ ట్రా డబ్బులు ఇస్తాం అన్నాడని,  మీరు కమిట్మెంట్ ఇచ్చానా పర్లేదు లేకపోయినా పర్లేదు అంటూ ఆప్షన్ ఇచ్చాడంటూ ఆ  బాంబ్ కూడా పేల్చింది. అయితే తాను ఏం సమాధానం ఏం చెప్పలేదని అయితే మీరు మాత్రం బిగ్ బాస్‌లో ఉంటారని అభిషేక్ మాటిచ్చారని చెప్పింది శ్రీరెడ్డి.


అయితే అభిషేక్ అంతటితో ఆగకుండా చూస్తుంటే నీ వక్షోజాలు చాలా పెద్దవిగా ఉన్నాయి, అవి ఒరిజినలేనా? లేక ఏదైనా సర్జరీనా అని అడిగాడని అతను అలా అడిగేసరికి అక్కడ చాలా ఇబ్బందిగా అనిపించి నీకు విప్పి చూపించనా అని సీరియస్‌గా అన్నానని దాంతో అతడు నీతో చాట్ చేస్తాలే అన్నాడని పూసగుచ్చినట్టు చెప్పింది శ్రీ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: