టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఇలియానా. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఇలియానాకు వెనువెంటనే సూపర్ స్టార్ మహేష్ సరసన పోకిరి సినిమాలో అవకాశం రావడం, అలానే అప్పట్లో ఆ సినిమా అతిపెద్ద చరిత్ర సృష్టించడంతో ఇలియానాకు బాగా కలిసి వచ్చింది. ఇక అక్కడి నుంచి టాలీవుడ్ లో ఆమెకు వెల్లువలా అవకాశాలు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ సహా పలువురు ఇతర నటుల సరసన కూడా నటించి మంచి పేరు సంపాదించిన ఇలియానా, కొన్నాళ్ల క్రితం సినిమాలు చేయడం బాగా తగ్గించారు. అయితే అందుకు ప్రధాన కారణం  ఆమె తన చిరకాల మిత్రుడు ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉండడమే అంటూ అప్పట్లో పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చినప్పటికీ, ఇలియానా మాత్రం నోరు విప్పలేదు. 

ఇక గత కొద్దిరోజులపాటు ఆమె సినిమా పరిశ్రమకు దూరం అయి, ఇటీవల సడన్ మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించిన ఇలియానా, తన సోషల్ మీడియా మాధ్యమాల్లో భావోద్వేగ భరిత ట్వీట్స్ పెడుతూ తన అభిమానుల మనసుల్లో కొంత ఆందోళన సృష్టించింది. దానిని బట్టి కొందరు ఆమె ప్రేమలో విఫలం అయిందని, అందుకే ఈ విధంగా బాధతో పోస్టులు పెడుతోందని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేయటం మొదలెట్టారు. ఇక ఎట్టకేలకు నేడు తన ప్రేమ విషయమై అసలు వాస్తవాలు బయటపెట్టిన ఇలియానా, రిలేషన్ షిప్ అంటే కేవలం ఒకరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, రెండు మనసులకు, జీవితాలకు సంబంధించింది. అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాని గురించి బహిరంగంగా మాట్లాడకూడదు, అలా చేసినట్లయితే అవతల వారిని మనం కించపరిచినట్లే. ఎందుకంటే వాళ్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది, 

రిలేషన్ లో ఉన్నవారికి కూడా గౌరవం ఇచ్చి ముఖ్యమైన విషయాలు బయట పెట్ట కూడదు అని చెప్పింది. ఇక నా పై గత కొద్ది రోజుల నుంచి వస్తున్న ట్రోలింగ్ చూస్తూనే ఉన్నాను, అలాంటివి నేను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ నాతో రిలేషన్ లో ఉన్న వ్యక్తి మాత్రం అటువంటి పట్టించుకోవచ్చు, నిజానికి మా ఇద్దరి మధ్య రిలేషన్ తెగిపోయి చాలా రోజులైంది. ఆ తర్వాత నుంచి నేను అతనికి దూరంగా ఉంటున్నాను. అయితే అదే సమయంలో నాకు తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్న బంధువులు, మిత్రులను అందరిని మనం మర్చిపోతాం, అయితే విడిపోయాక గని నాకు వారి విలువ తెలిసి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. కాగా ఇలియానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతన్నాయి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: