సంక్రాంతికి  నాలుగు సినిమాలొస్తున్నా.. పోటీ మొత్తం రెండు సినిమాల మధ్యలోనే. మహేశ్ "సరిలేరు నీకెవ్వరు"తో బన్నీ "అల వైకుంఠపురములో" తో వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు జనవరి 12న రావడంతో భారీ ఫైట్ నెలకొంది. 


ఇద్దరు పెద్ద హీరోలు ఒకే రోజు వస్తే ఇద్దరికీ నష్టమే. ఈ సంగతి వాళ్లకు తెలియనిది కాదు. ఎట్టకేలకు ఒకటి, రెండు రోజుల తేడాతో వస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదన్న మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఎవరు తగ్గుతారన్న సంగతి పక్కనపెడితే.. ఎవరికి వాళ్లు పోటీపడి మరీ ప్రమోషన్ చేస్తున్నారు. 


సంక్రాంతి పోటీలో బన్నీ దూసుకుపోతున్నాడు. ఓ చిన్న టీజర్ తో ఆగకుండా.. రెండు వారాలకో సాంగ్ తో సందడి చేశారు. రిలీజ్ చేసిన రెండు పాటలు అందరినీ ఇంప్రెస్ చేశాయి. జానపదంగా సాగే పాటను ఈ వారంలో మూడోసాంగ్ గా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. 


తమన్ మ్యూజిక్ అల వైకుంఠపురములోకు క్రేజ్ తీసుకొచ్చింది. ఇన్ డైరెక్ట్ గా సరిలేరు నీకెవ్వరు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ కు సవాల్ విసిరాడు. సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ మాస్ ఆడియన్స్ కు చేరువైంది. అల వైకుంఠపురములో నుంచి మూడో పాట వస్తుంటే.. సరిలేరు నీకెవ్వరు నుంచి రెండోసాంగ్ కూడా బైటకు రాకపోవడంతో.. వెనుకబడిపోయామన్న ఫీలింగ్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. అనిల్ రావిపూడి.. తన ట్విట్టర్ లో స్టిల్స్ పెడుతున్నా.. మ్యూజికల్ గా సందడి చేయాలనుకుంటున్నారు అభిమానులు. 


సంక్రాంతి బరిలో  ఈ రెండు సినిమాలు ఉండటంతో.. ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. తమ అభిమాన హీరోల సినిమాలు ఎలా ఉంటాయోనని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, కోడి పందాలు, గాలిపటాలతో పాటు.. తమ అభిమాన హీరోల సినిమాలతో ఫుల్ ఎంజాయ్ చేయనున్నారు మహేశ్, బన్నీ ఫ్యాన్స్. 



మరింత సమాచారం తెలుసుకోండి: