ఈ మధ్యకాలం.. అని అనకూడదు .. ఎప్పుడు జరిగేవే ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంచం కూడా మానవత్వం లేకుండా ఆడవారిని అత్యాచారం చేస్తున్నారు నీచులు. పుట్టిన పసి పాప నుండి 90ఏళ్ల వృద్ధురాలు వరుకు ఎవరిని వదలటం లేదు ఈ కామాంధులు. ఇంకా విషయానికి వస్తే ఓ నీచుడు ఆ నటిని రేప్ చేసాడని ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమ ఉగిపోయేలా చేస్తున్నాయి. 

                      

హిందీలో బాగా పాపులర్ సీరియల్స్ ఆయిన 'కహానీ ఘర్ ఘర్ కీ', 'నచ్ బలియే' వంటి సీరియల్స్ లో నటించిన  ఓ అందాల నటి తనను జూనియర్ ఆర్టిస్ట్ వినీత్ అనే యువకుడు రేప్ చేశాడంటూ మీడియా ముందుకు వచ్చింది. అక్టోబర్ 13న ముంబయిలోని యమునా నగర్‌లో ఉన్న ఓ హోటల్‌కు వినీత్ ఆమెని రమ్మని చెప్పాడని ఆమె తెలిపారు. ఆ సమయంలో ఆమెకు ఇచ్చిన జ్యూస్‌లో డ్రగ్స్ కలిపాడని ఆమె పేర్కొన్నారు. 

                

కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో వినీత్ ఏం చెబితే అది చేశానని, ఆ సమయంలో అతను ఆమెను లొంగదీసుకున్నాడని ఆమె చెప్పారు. అయితే గర్భం దాల్చే వరకు వినీత్ ఆమెను రేప్ చేశాడన్న విషయం ఆమెకు తెలీలేదని వెల్లడించింది. దీంతో పెళ్లి చేసుకోమని వినీత్‌ను ఆమె కోరితే గర్భం దాల్చినందుకు చేసుకోనని ముఖం చాటేశాడని వాపోయింది. అతను పెళ్ళికి నిరాకరించడం వల్లే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. సీరియల్స్‌లో పని చేస్తున్నప్పుడు వినీత్ ఆమెకు పరిచయమయ్యాడు అని ఆమె చెప్పింది. అయితే ప్రస్తుతం వినీత్ పరారీలో ఉన్నాడు, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: