బిగ్ బాస్ సీజన్ త్రీ తర్వాత బాగా పాపులర్ అయిన వాళ్లలో పునర్నవి భూపాలం ఒకటి. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి బేబీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాహుల్ తోనే కాదు హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్, అతని భార్య వితిక తో కూడా బాగా స్నేహం చేసింది ఈ పునర్నవి. వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ గా ఉంటూ బిగ్ బాస్ అభిమానులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ను అందించారు. 


నిజానికి బిగ్ బాస్ సీజన్ 1 అండ్ 2 కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు కాని వాళ్ళు మాత్రం ఎప్పుడు కలిసిన... కలిసి తిరిగిన సందర్భాలు లేవు. కానీ బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే పునర్నవి, రాహుల్, వరుణ్ సందేశ్, వితిక కలిసి ఎన్నోసార్లు కనిపించారు. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ త్రీ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా.. వాళ్లంతా కలిసి ఒక పార్టీ కూడా చేసుకున్నారు.

ఆ పార్టీ తర్వాత కూడా వీళ్ళు కలిసి తిరుగుతున్నారంటే వీళ్ళ మధ్య స్నేహం ఎంతగా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా పునర్నవి, వితిక, వరుణ్ సందేశ్ తో సహా ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు కలిసి ఒక పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీ లో భాగంగా పునర్నవి వితిక, హిమజ తో కలిసి ఒక ఫోటో దిగింది. 


ఆ ఫోటోలో పునర్నవి ఒక ప్లకార్డు ని తన వెనుక అంటే అక్కడ పట్టుకొని ఫోటోకి పోజ్ ఇచ్చింది. ఆ ప్లకార్డులో ఇలా రాసి ఉంది. 'కిస్ మై యాస్'. దీన్ని తెలుగులోకి వర్డ్ టూ వర్డ్ ట్రాన్సలేట్ చేస్తే బూతు పదం ఏర్పుడుతుంది. కానీ ఇది ఒక ఇంగ్లీష్ ప్రెజ్.. ఈ 'కిస్ మై యాస్' ఇంగ్లీష్ ప్రేజ్ కి అర్ధం ఏంటంటే 'ఎవర్ని లెక్క చేయను ఎవర్ని గౌరవించను'. కానీ పునర్నవి పక్కన ఉన్న అమ్మాయిలు పట్టుకున్న ప్లకార్డులు ("టూ సెక్సీ", "ఆమె మందు తాగింది") చూస్తుంటే కొంచెం తేడాగానే ఉంది. వారి ఎక్సప్రెషన్స్ కూడా కొంటెగానే ఉన్నాయి. మొత్తానికి ఈ ఫోటో అభిమానుల మధ్య చర్చనీయాశం అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: