టాప్ హీరోల కొడుకులు కూతుళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలలో నటిస్తున్న సందర్భాలు అనేకం జరిగాయి. అయితే దర్శకుల వారసులు మాత్రం అదే ఫిలిం ఇండస్ట్రీలో చిన్నతనం నుండి రాణించిన సందర్భాలు చాల అరుదు. అయితే దీనికి భిన్నంగా దర్శకుడు మారుతి కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిలిం ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమెకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీకి హాట్ టాపిక్ గా మారాయి. 

ఈరోజు సంగీత దర్శకుడు తమన్ పుట్టినరోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మారుతిల కాంబినేషన్ లో రాబోతున్న ‘ప్రతిరోజు పండుగే’ మూవీకి సంబంధించి ఒక పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ‘బావా మా అక్కను సక్కగా సూస్తావా’ అంటూ ఫోక్ స్టైల్ లో సాగే పాటను రిలీజ్ చేసారు. ఈ పాటలో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తున్న రాశి ఖన్నా చెల్లెలుగా ఒక అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి మరెవ్వరో కాదు మారుతి కూతురు ఆ అమ్మాయి పేరు అభీష్ట.

చిన్నప్పటి నుండి భరత నాట్యం అంటే బాగా మక్కువ ఉన్న ఈ అమ్మాయికి సినిమాలలో నటించడం అంటే కూడ చాల ఇష్టమట. దీనికితోడు ఈ అమ్మాయి మంచి పెయింటర్ అని కూడ తెలుస్తోంది. దీనితో ఆ అమ్మాయి అభిరుచి గ్రహించిన మారుతి తన కూతురుని ఈ మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతున్న నేపధ్యంలో రానున్న రోజులలో మారుతి కూతురు హీరోయిన్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీసులో అతి చిన్న ఉద్యోగిగా పనిచేసిన మారుతి స్వయంకృషితో దర్శకుడుగా మారి మొదట్లో బూతు దర్శకుడుగా పెరుతెచ్చుకున్నా ఇప్పుడు తన ఇమేజ్ ని మార్చుకుని ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాల దర్శకుడుగా మారిపోయాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: