నవతరం హీరోయిన్స్ కు స్వీటీ అనుష్క ఓ స్పూర్తిదాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం కమర్షియల్ సినిమాల్లో ఆటపాటలకే పరిమితమవుతున్న హీరోయిన్స్ కు ఒకప్పటి వన్నె తెచ్చేలా చేసింది అనుష్క. ఆమె చేసిన అరుంధతి సినిమా స్టార్ సినిమాకు వచ్చిన వసూళ్లు రాబట్టింది. కోడి రామకృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. 


అప్పటి నుండి అనుష్క క్రేజ్ డబుల్ అయ్యింది. ఆ తర్వాత రుద్రమదేవి, బాహుబలి, భాగమతి ఇలా స్పెషల్ సినిమాలన్ని చేస్తూ వచ్చింది. సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ఇప్పటివరకు ఆ బరువు తగ్గించుకునే ప్రయత్నాలనే చేస్తుంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్ధం సినిమా చేస్తుంది. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ ప్లాన్ చేశారు.


అయితే ఇక మీదట హిస్టారికల్ మూవీస్, భారీ బడ్జెట్ సినిమాలు చేయలేనని చెబుతుంది అనుష్క. వాటి వల్ల ఎక్కువరోజులు షూటింగ్ చేయాల్సి వస్తుందని.. మేకప్ కూడా ఎక్కువ సమయం తీసుకుంటుందని.. దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటుంది అనుష్క. అందుకే ఇక మీదట అలాంటి సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యిందట.  


కమర్షియల్ సినిమాల్లో అయితే తాను కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నిశ్శబ్ధం సినిమాలో డెఫ్ అండ్ డం గా అనుష్క సర్ ప్రైజ్ చేస్తుంది. మరి అనుష్క చారిత్రక సినిమాలు చేయనని చెప్పింది.. అయినా ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తే చేయకుండా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే కంటెంట్ ఉన్న సినిమాలకు పెద్దగా బడ్జెట్ అవసరం లేదు. నిశ్శబ్ధం సినిమాలానే ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమే అంటుంది అనుష్క. ప్రస్తుతం హీరోయిన్స్ అందరు ఇదే తరహా సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: