'మౌని రాయ్' బుల్లి తెర నుంచి వెండితెరకు వెళ్లిన ఈ భామ ఫ్యాన్స్‌లో చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ భామ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అనతి కాలంలోనే పేరు సంపాదించుకున్న నటిగా ఈ భామకు పేరుంది. మొదట బుల్లి తెరలో నటించినా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల మౌనీ రాయ్ కథానాయికగా నటించిన చిత్రం ‘మేడ్ ఇన్ చైనా’ అనే సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించారు.


అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజ్‌కుమార్, మౌనీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఓ మీడియా ఆఫీస్‌కి వెళ్లారు. వారు ఇరువురిని ఓ గదిలో కూర్చోబెట్టారు. మౌనీ, రాజ్‌కుమార్ ఏదో చర్చించుకుంటూ ఉండగా.. ఓ అపరిచిత వ్యక్తి మౌనీ అభిమానిని అంటూ వారున్న గదిలోకి దూరాడు. తన చేతిలో ఉన్న బొకేను మౌనీకి ఇస్తూ.. ఐ లవ్యూ అని ప్రపోజ్ చేసేశాడు. దాంతో అతన్ని చూసి మౌనీ భయపడిపోయింది. అక్కడే ఉన్న రాజ్‌కుమార్ ఆ వ్యక్తిని బయటికి పంపించేందుకు ప్రయతించాడు.


దాంతో రాజ్‌కుమార్‌ పక్కకు తోసేశాడు ఆ వ్యక్తి. ఈ సీన్ చూసి భయపడిన మౌనీ వెంటనే బాడీగార్డ్స్‌ను పిలిపించింది. అప్పుడు రాజ్‌కుమార్ ఇది కేవలం ప్రాంక్ అని చెప్పి మౌనీని కూల్ డౌన్ చేశాడు. అప్పుడు మౌనీ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ప్రాంక్ అని తెలీక మౌనీకి ముచ్చెమటలు పట్టేశాయి. 


అయితే ఇలాంటి ప్రాంక్స్ ఇంకెప్పుడూ చేయొద్దు అంటూ మౌనీ రాజ్‌కుమార్‌ను తిట్టిపోశారు. అయితే మౌనీకి ప్రపోజ్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఇండియాలోనే నెంబర్ వన్ ప్రాంక్‌స్టార్ అట. ఈ విషయాన్ని అతనే ఓ వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోను అతను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: