సెలబ్రిటీస్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.. వారు ఎక్క్డకు వెళ్లినా సరే వాళ్లను ఫాలో అవుతూ అభిమానులు వస్తుంటారు. స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అనే తేడా లేకుండా సెలబ్రిటీస్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంటున్నారు. అలానే బుల్లితెర మీద నాగినిగా అలరించిన మౌనీ రాయ్ ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది.


సీరియల్ లో ఆమె నటన చూసిన బాలీవుడ్ మేకర్స్ ఆమెకు వరుస ఛాన్సులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె మేడ్ ఇన్ చైనా సినిమాలో నటిస్తుంది. రాజ్కుమార్ రావ్ హీరోగా మౌనీ రాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ కోసం ఓ గదిలో వారు ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్లు గదిలో ఉండటం చూసి మౌనీ రాయ్ అభిమాని ఆ గదిలో దూరి ఆమెకు ప్రపోజ్ చేశాడట.


చేతిలో బొకే కూడా ఉందట.. ఆమెకు ప్రపోజ్ చేసే క్రమంలో పక్కనే ఉన్న హీరో రాజ్ కుమార్ అడ్డు వచ్చిన ఆ ఫ్యాన్ అతన్ని నెట్టివేశాడట. అయితే ఆ నిమిషంలో మౌనీ రాయ్ కు చెమటలు పట్టాయట. అయితే వెంటనే బాడీ గార్డ్స్ ను పిలిచే టైం కు ఇదంతా ఫ్రాంక్ అని చెప్పారట. ఇండియాలోనే నంబర్ 1 ఫ్రాంక్ స్టార్ చేసిన సర్ ప్రైజ్ అది. విషయం తెలుసుకున్న మౌనీ రాయ్ సర్ ప్రైజ్ అవడంతో పాటుగా షాక్ అయ్యిందట. 


అయితే సెక్యురిటీని దాటుకుని అతను అక్కడకు వచ్చాడు అంటేనే మౌనీ రాయ్ కు ఎంతో భయం వేసిందట. కాని ఇదంతా హీరో రాజ్ కుమార్ ఆధ్వర్యలోనే జరిగిందని తెలిసి షాక్ అయ్యిందట. మొత్తానికి మౌనీ రాయ్ తో ఆ వ్యక్తి ఫ్రాంక్ చేసిన విధానం థ్రిల్ కలిగించిందట. అయితే మౌనీ రాయ్ ఇక మీదట ఇంకాస్త జాగ్రత్త పడతానని చెప్పిందట.



మరింత సమాచారం తెలుసుకోండి: