బిగ్ బాస్ కి వచ్చిన సెలబ్రిటీలు ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ కి వచ్చిన సీరియల్ సెలబ్రిటీ ఇమేజ్ కూడా బాగానే పెరిగింది. ఇంతకీ ఆ సెలబ్రిటీ  అసలు ఎవరనుకున్నారు బిగ్ బాస్  మంచోడు. అదేనండి బిగ్ బాస్ షో లో  మంచోడుగా  పేరు తెచ్చుకున్న రవి. బిగ్ బాస్ షో ఎవరు ఏమన్నా మంచి మనసుతో కోపం లేని మనిశిగా ఉండి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు రవి.  బిగ్ బాస్  సభ్యులందరూ రవి నీ మంచోడు మంచోడు అని పిలవడం మొదలుపెట్టారు. కానీ బిగ్ బాస్ లో మంచివాడిగా పేరు తెచ్చుకున్న రవి మాత్రం ఇప్పుడు చెడ్డవాడిగా మారిపోయాడు. ఒక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి తో రాసలీలలు సాగిస్తున్నాడు  బిగ్ బాస్  మంచోడు. ఏంటి మంచోడు అనుకున్నాం రవి  అంత పని చేసాడా  అని ఆశ్చర్యపోకండి. బిగ్ బాస్ రవి చెడ్డోడిగా  మారింది రియల్ లైఫ్ లో కాదు రిల్ లైఫ్ లో. 



 బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ప్రస్తుతం రవి ఆమె కథ  అనే సీరియల్లో నటిస్తున్నాడు. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మెగా స్టార్ చిరంజీవి...  రవి కి ఓ నెగిటివ్ క్యారెక్టర్ చేసెయ్  అంటూ సలహా ఇచ్చారు. మెగా స్టార్ సలహాని రవి తూచా  తప్పకుండా పాటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆమె కథ సీరియల్ లో రవి నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు . ఈ పాత్రలో మంచోడు గా పేరు తెచ్చుకున్న రవి విలన్ ను తలపిస్తున్నడు. మొదటిసారి నెగిటివ్  పాత్రలో నటిస్తున్న రవి  బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. అయితే ఆమె కథ సీరియల్ లో మహేశ్వరి (హీరోయిన్) ఓ పేదింటి అమ్మాయి.అమ్మ నాన్న  లేకపోవడంతో పిన్ని దగ్గరే ఉంటూ జాబ్ చేస్తూ కుటుంబ పోషణ చేస్తూ  ఉంటుంది.  సంప్రదాయం బాగా తెలిసిన అమ్మాయి. 



 అయితే సూర్యవంశ రాజమహల్ కు చెందిన గౌతం (హీరో రవి కుమార్) తనకు ఎవరూ లేరంటూ నమ్మించి  మహేశ్వరుని పెళ్లి చేసుకుంటాడు. రాజవంశానికి ఉన్న  శాపం పోవడానికి స్టేషన్ ఆశ్లేషనక్షత్రంలో పుట్టిన అమ్మాయి కోసం వెతికుతుంది  రాజమాత. అయితే పథకం ప్రకారమే రాజమాత కోరిక మేరకు గౌతం(రవి) మహేశ్వరిని  పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి ఏదో ఒక మాయ మాటలు చెప్పి మల్లేశ్వరి నమ్మిస్తూనే ఉంటాడు .తన నిజ  స్వరూపం మహేశ్వరికీ  తెలియకుండా మాయ మాటలు చెబుతున్నాడు. అయితే పెళ్లి తర్వాత  మహేశ్వరి గౌతమ్ కీ  శోభనం ఏర్పాటు జరుగుతుంది. మహేశ్వరి పుత్రుడిబొమ్మలా ముస్తాబై   శోభనం గదిలో భర్త గౌతమ్ కోసం చూస్తూ  ఉంటుంది.. గౌతమ్ మాత్రం శోభనం గదిలోకి వెళ్ళకుండా పని మనిషి దగ్గరికి వెళ్లి శృంగారంలో పాల్గొంటారు. శోభనం గదిలోకి తన భర్త వస్తాడని ఎదురుచూస్తున్న మహేశ్వరి మాత్రం అలాగే ఎదురుచూస్తూ నిద్రపోతుంది. కాగా  ఒకరితో పెళ్లి ఇంకొకరితో శృంగారం అంటూ నెగటివ్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు మంచోడు గా పేరు తెచ్చుకున్న రవి .


మరింత సమాచారం తెలుసుకోండి: