వెంకీ మామ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలిచిన సినిమాల్లో ఒకటి. విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగ చైతన్య మామ-మేనల్లుడు పాత్రలు పోషిస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ వరుసగా నాగ చైతన్య, వెంకటేష్ సరసన నటించనున్నారు.ఇక ఈ చిత్రం ఇప్పుడు  షూటింగ్ పూర్తి చేసుకుని సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తోంది. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాత. సురేష్ బాబు చాలా ఖచ్చితత్వంతో వుంటారు అయినప్పటికీ, ఈ సినిమా విడుదల తేదీ విషయం పై చాలా గందరగోళంగా  ఉంది.


మొదట్లో,  ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదల చేయబడుతుందని సినిమా పంపిణీదారులకు ప్రకటించారు, కానీ ప్రస్తుతం పరిస్థితి మరోలా ఉంది. పండుగ సీజన్ కోసం ఇప్పటికే భారీ పోటీ ఉన్నందున వెంకీ మామ టీం సంక్రాంతి బరి నుండి వైదొలిగారు. తరువాత, వారు క్రిస్మస్ సీజన్లో విడుదలకు ప్లాన్ చేసుకున్నారు, కానీ ఈ క్రిస్మస్ సీజన్ సాయి ధరం తేజ్ మరియు నందమూరి బాలకృష్ణలతో నిండి ఉంది, ఈ సీజన్లో వారి సినిమాలను షెడ్యూల్ చేసారు. గత కొన్ని రోజుల నుండి, విడుదల తేదీ గురించి చాలా పుకార్లు వచ్చాయి కాని ఏదీ అధికారికం ప్రకటించలేదు.


వెంకీ మామ విడుదల గురించి ఇటీవల సురేష్ బాబు స్పందించారు. విడుదల తేదీ గురించి నేను పూర్తిగా గందరగోళంలో ఉన్నానని ఆయన స్వయంగా అంగీకరించారు కాని సినిమా ఖచ్చితంగా డిసెంబర్ విడుదల అవుతుంది అని అయన చెప్పారు. తరువాత ఇంటర్వ్యూలో, "వెంకటేష్ పుట్టినరోజు డిసెంబర్ 13 న ఉన్న కారణంగా ఆ రోజే వెంకీ మామ సినిమా విడుదల చెయ్యాలి అని చాలా మంది సూచించారు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, డిసెంబర్ 20 న విడుదలవుతున్న సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 తెలుగు వెర్షన్‌కు సురేష్ బాబు పంపిణీదారు. కాబట్టి అతను తన సొంత చిత్రంతో పోటీకి వెళ్ళలేడు. కావున వెంకటేష్ పుట్టినరోజున వెంకీ మామ మూవీ ని విడుదల చేయనున్నట్లు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: