వెటరన్ ఫోర్ టాప్ స్టార్స్ లో వెంకటేష్ రూటే సెపరేటు. మొదటి నుంచి కూడా వెంకటేష్ తన  సినిమాలను  భిన్నంగానే చేస్తూ పోతూంటారు. యాక్షన్ మూవీ వైపు అంతా వెళ్తే ఆయన ఫ్యామిలీ హీరో అనిపించుకున్నారు. క్లాస్ లో మాస్ గా సక్సెస్ మీద సక్సెస్ కొట్టారు. ఇక వెంకీకి విక్టరీ హీరోగా బిరుదు కూడా ఉంది. ఇపుడు అందరు   హీరోలు 60 యేళ్ళలో పడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయినా వెంకీ ఎక్కడా తగ్గడంలేదు.


మిగిలిన సీనియర్ హీరోలకు అసలు కొత్త  హీరోయిన్లు దొరకడంలేదు. దాని వల్ల వారి సినిమా షూటింగులు కూడా ఆగిపోతున్నాయి. కానీ అదేం అద్రుష్టమే వెంకీకి మాత్రం ఏ లోటూ లేకుందా గ్లామర్ డోస్ బాగా ఎక్కువగానే ఉంటోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన ఎఫ్ టూ మూవీలో వెంకీ పక్కన్న తళుకు బెళుకుల తమన్నా చేసింది. ఆమెతో ఆడి పాడి వెంకీ యంగ్ హీరోలకు పోటీ ఇచ్చాడు.


తమన్నా  ఇంతవరకూ సీనియర్ హీరోలతో ఎక్కడా నటించలేదు. ఆమెతో మూవీస్ చేయలాని సీనియర్లు  కబురు పంపినా కూడా నో అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసింది. అటువంటి తమన్నా వెంకీతో మాత్రం కసి రేపే రోమాంటిక్ ఫోజులతో డూయెట్టులే పాడింది. వెంకీకి జోడీగా భేష్ అనిపించుకుంది. దీంతో వెంకీకి యంగర్ జనరేషన్ లో కూడా కొత్త ఫ్యాన్స్ ఏర్పడ్డారు.


మూవీ తరువాత వెంకీ చేస్తున్న వెంకీ మామ మూవీ లో కూడా పాయల్ రాజ్ పుత్ తో డ్యూయెట్లేసుకున్నాడు. పాయల్ అంటేనే హీటెక్కించ నెరజాణ. ఆమెతో చాన్స్ కొట్టేసిన ఘనత కూడా వెంకీకే దక్కడం విశేషం. ఈ ఏజ్ లో కూడా వెంకీ గ్లామర్ భామలను  పడకొట్టేయడంపైన టాలీవుడ్లో పెద్ద చర్చ సాగుతోంది. మిగిలిన సీనియర్లకు అందకుండా తప్పించుకుని తిరుగుతున్న అందాల చందమామలు వెంకీ మామ తోనే ఎందుకు జోడీ కడుతున్నారు. ఆ సీక్రెట్ ఏంటి అన్నది మాత్రం తెలియక సీనియర్లు తల పట్టుకుంటున్నారుట. దటీజ్ వెంకీ అంటున్నారంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: